Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుస్తున్న లేటెస్ట్ సినిమా ‘పుష్ప’ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇందులో కన్నడ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీస్ తో కలిసి ముత్యం శెట్టి మీడియా వారు 200 పైగా బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా 5 భాషలలో రిలీజ్ చేయనున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాదిలో రిలీజ్ చేయనున్నారు.
వాస్తవంగా ఆగస్టు 13న పుష్ప సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ దశలో ఆగిపోవడంతో పోస్ట్ పోన్ అయింది. అయితే అదే డేట్ కి ఈ సినిమాలో ని మొదటి పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈమేరకు సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ అప్డేట్ ఇచ్చారు. ఈ ఫస్ట్ సింగిల్ 5 భాషలలో 5 మంచి పాపులర్ సింగర్స్ పాడబోతుండటం విశేషం. తెలుగులో శివమ్, తమిళ్ లో బెన్నీ దయాల్, హిందీలో విశాల్ దడ్లానీ, కన్నడలో విజయ్ ప్రకాశ్, మలయాళంలో రాహుల్ నంబియార్ ఈ సాంగ్‌ను పాడనున్నట్లు వెల్లడించారు.
Pushpa : సాంగ్ మేకింగ్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందట.
అల్లు అర్జున్ – సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో మూవీ అంటే మ్యూజికల్ గా ఏ రేంజ్ హిట్ సాధిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యూజిక్ పరంగా మరో స్థాయిలో ఉంటుందని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాను మ్యూజిక్ పరంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో కూడా కంపేర్ చేయడం ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఇక ఈ సాంగ్ మేకింగ్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందట. చూడాలి మరి పుష్ప ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్లో ట్రండ్ సెట్టర్ అవుతుందో. ఇప్పటికే అల్లు అర్జున్ లుక్ అలాగే టీజర్ సినిమా మీద భారీగా అంచనాలు పెంచాయి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!