Pushpa: ఇన్ని రోజులు పుష్ప సినిమాకు ఎవరు పోటీ లేదనుకున్నారు. నిజం చెప్పాలంటే తెలుగులో రూపొందిన పెద్ద సినిమా ఏదీ పుష్ప రిలీజ్ రోజు రావడం లేదు. సుకుమార్ తెరకెక్కిస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా. అల్లు అర్జున్‌కు మొదటి పాన్ ఇండియన్ సినిమా. హీరోయిన్ రష్మిక మందన్నకు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కు మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇలా పుష్ప సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. సక్సెస్ పరంగా చూస్తే ఈ సినిమా అందరికీ ప్రత్యేకమే. ముందు ఎలాంటి ప్లాన్ చేసుకోకపోయినా ఇప్పుడు మాత్రం రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు.
మొదటి భాగం డిసెంబర్ 17న రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 5 భాషలలో పుష్ప ది రైజ్ పార్ట్ 1 అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో పుష్ప సినిమాకు పోటీ అనేది లేదు. హిందీలో ఆమిర్ ఖాన్ – నాగ చైతన్యల లాల్ సింగ్ చద్దా ఉండాల్సింది. కానీ ఆ సినిమా కూడా పోస్ట్‌పోన్ అయింది. దాంతో సోలోగా వస్తున్నారని అందరు భావించారు. కానీ ఏకంగా హాలీవుడ్ సినిమా అదే రోజున రిలీజ్ డేట్ ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చింది. హాలీవుడ్ సినిమా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
Pushpa: రిలీజ్ డేట్ మారే అవకాశాలే ఉన్నాయని చెప్పుకుంటున్నారు.
కాబట్టి ఇది ఖచ్చితంగా పుష్ప మీద గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. గత ఏడాది నుంచి ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌తో కన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు పుష్ప మేకర్స్‌లో ముఖ్యంగా సుకుమార్‌కు టెన్షన్ మొదలైందట. అందుకే డిసెంబర్ 17న కాకుండా 24న రిలీజ్ చేసేందుకు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దాదాపు రిలీజ్ డేట్ మారే అవకాశాలే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే అదే రోజు నని శ్యామ్ సింగ రాయ్, వరుణ్ తేజ్ గని సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.