“Pushpa”: అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్..ఆ ఇమేజ్ వచ్చింది పుష్ప సినిమాతో. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమాగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో నిర్మాణ సంస్థ ముత్తం శెట్టి మీడియాతో కలిసి దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు కన్నడ, మలాయళం ఇండస్ట్రీస్‌లో ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.
హిందీ ఇండస్ట్రీలోనూ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ సినిమాలు హిందిలో డబ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే పుష్ప సినిమాను ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా డిసెంబర్ 17న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు సమంత స్పెషల్ సాంగ్ తాజాగా రిలీజై మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు ఇప్పటివరకు పుష్ప సినిమా నుంచి వచ్చి అంచనాలు పెంచిన సాంగ్స్ అన్నిటికంటే ఓ మెట్టు పైనే ఉంది.
“Pushpa”: 250 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్..!
ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్‌తో అర్థమైంది. అన్నీ రకాలుగా పుష్ప సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. దాంతో ఊహించని విధంగా ఈ సినిమాకు థియేట్రికల్ ఓవర్సీస్.. డిజిటల్ శాటిలైట్… ఓటీటీ.. ఆడియో రైట్స్.. ఇలా అన్నీ కలిపి 250 కోట్లకు పైగానే బిజినెస్ అయిందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెప్పాలంటే ఇది భారీ రేంజ్లో జరిగిన బిజినెస్. ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ఉంటే ఇక సినిమా రిలీజయ్యాక వసూళ్ళ పరంగా ఎన్ని సరికొత్త రికార్డులు సృష్ఠిస్తుందో చూడాలి.