Pushpa Review: అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన ‘పుష్ప’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కొద్దిసేపటిక్రితమే విడుదల అయింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బన్నీ- సుక్కు కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూద్దాం…
పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ( Allu Arjun ) చిత్తూరు అడవుల వద్ద నివాసం ఉంటూ అడవిలో కూలి పనికి వెళుతూ ఉంటాడు. అయితే కూలి చేస్తే వచ్చే డబ్బుతో పోలిస్తే వ్యాపారం ద్వారా ఎంతో సంపాదించవచ్చని తెలుసుకుంటాడు. తన తెలివితేటలతో యజమానుల సరుకు పోలీసులకు చిక్కకుండా వారికి లాభాలు తెచ్చిపెడుతూ పార్టనర్ అవుతాడు. ఇదే సమయంలో సిండికేట్ లీడర్ మంగళం సీను (సునీల్) కలుస్తాడు. మంగళం శీను సిండికేటే లోని మిగిలిన సభ్యులను ఎలా మోసం చేస్తున్నాడో సిండికేట్ సభ్యులకి, వారితో ఉన్న మంత్రి రావు రమేష్ కళ్ళు తెరిపిస్తాడు పుష్ప. ఆ తర్వాత పుష్ప ఎలా పెద్ద డాన్ అయ్యాడు..? మొదటి భాగం చివరలో ఏం జరుగుతోంది..? అసలు రెండవ భాగంలో ఆతనికి ఎలాంటి చాలెంజ్ లు ఎదురవుతాయి అన్నది మిగిలిన కథ.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనను ఎంత పొగిడినా తక్కువే. చిత్తూరు యాసలో మరీ నాటుగా రూపొందించిన క్యారెక్టర్ లో అల్లు అర్జున్ ఇరగదీశాడు.
ఈ చిత్రంలో మరొక ప్లస్ పాయింట్ అదిరిపోయే మాస్ డైలాగ్స్. పుష్ప రాజ్ గా అల్లుఅర్జున్ డైలాగ్స్ మాస్ థియేటర్లను ఊపేశాయి.
సైడ్ క్యారెక్టర్ లలో సునీల్ సహా మిగతా వారు కూడా అదే రీతిలో మెప్పించారు. రష్మిక మందన్న నటన చిత్రానికి ప్రధాన హైలెట్. తనకి అల్లు అర్జున్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని ఇచ్చాయి.
ఈ చిత్రంలోని ఫైట్ సన్నివేశాలు అన్నీ సరికొత్తగా రూపొందించబడ్డాయి. తనదైన శైలి విభిన్న సినిమాటోగ్రఫీ తో ప్రేక్షకులను థియేటర్లలో మంత్రముగ్ధులను చేశారు సుకుమార్, కూబా.
చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఎడిట్ చేయవచ్చు అనిపించింది. తల్లి సెంటిమెంట్ ఈ చిత్రం కథకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఇంకా తెలియదు.
పాటల కొరియోగ్రఫీ అనుకున్నంత స్థాయిలో లేదు. బన్నీ నుండి డ్యాన్స్ కోరుకున్న వారు నిరాశ చెందుతారు. అడవి, గ్రామం నేపథ్యంలోనే సినిమా సాగడం, కొన్ని మొరటు సన్నివేశాలు ఒక వర్గం ఆడియన్స్ కు రుచించకపోవచ్చు.
క్లైమాక్స్ మరింత బాగా చిత్రీకరించవచ్చు అనిపించింది. అతి బలమైన కథనం రెండవ భాగంలో ఉన్నప్పటికీ మొదటి అర్థ బాగం ముగింపు ఇంకొంచెం హై తో ముగించుంటే బాగుండేది.
మొత్తానికి అల్లు అర్జున్ దేశం మొత్తం అతని పేరు రీ సౌండ్ వచ్చే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సుకుమార్ తనకి ఉన్న తెలివైన డైరెక్టర్ అనే పేరుని నిలబెట్టుకోగా… సునీల్ మొదలుకొని ప్రతిఒక్క క్యారెక్టర్ తమ వంతు న్యాయం చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ అంతంతమాత్రంగా ఉంది. అయితే పక్కా మాస్ ఎలిమెంట్స్ నిండిపోయిన ఈ సినిమా సాధారణ క్లైమాక్స్ ను పక్కన పెడితే… థియేటర్ల వద్ద కలెక్షన్ల ఊచకోత కోస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
చివరి మాట: పుష్ప… పుష్ప రాజ్… అసలు తగ్గలేదు..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…
ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…