Pushpa: 2021 లో పుష్ప సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి మనకు తెలిసినదే. గత మూడు నాలుగు వారాలుగా అదికూడా ఓ.టీ.టీ అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత, టాలీవుడ్ ఏ కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ ఈ సినిమాని చూసి అల్లు అర్జున్ నీ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి వాటికి రిప్లై లు కూడా మన ఐకాన్ స్టార్ ఇవ్వటంతో ఒక చిన్న సైజు సునామీ సృష్టిస్తుందని మనం చెప్పుకోవచ్చు.
ఇటీవలే సుమంత్ అక్కినేని ఒక ట్వీట్ చేశారు.”ఈ సినిమా నేను కొంచెం లేట్ గా నే చూస్తున్నాను కానీ నీ అల్లు అర్జున్ మాత్రం పుష్ప లో ఫైర్ అనే చెప్పుకోవచ్చు. ఇంతటి ఘన విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్”. దీనికి మన బన్నీ బాయ్ “థాంక్యూ మై బ్రదర్. నాకు చాలా ఆనందంగా ఉంది నా పర్ఫామెన్స్ మీకు నచ్చినందుకు” రిప్లై ఇచ్చారు.
ఇప్పుడు ఇది సెన్సేషన్ గా మారిన విషయం ఏమిటంటే మన అల్లు అర్జున్ రిప్లై ఇచ్చిన సమయం. బుధవారం రాత్రి 2:30am కు తన రిప్లై ని పెట్టడం తో నెటిజన్లు వెంటనే దానికి రిప్లై ఇస్తూ ‘నిద్రపోవా పుష్ప’ అని పెట్టడం మనం చూశాము.
అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ ఈ మధ్య ట్విట్టర్ లో,ఇన్స్టాగ్రామ్ లో చాలా ఆక్టివ్ గా ఉంటూ తన గురించి ఇంకా పుష్ప సినిమా మా గురించి వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తూ, తనకంటూ వేసిన పోస్ట్ కు సమాధానం ఇస్తూ లేదా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టటం మనం రోజూ చూస్తూనే ఉన్నాము.
ఇంతటి ఘన విజయం సాధించిన ‘పుష్ప’ సినిమా కు వస్తున్న ప్రశంసలు తో అల్లుఅర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తో బన్నీ ఫాన్స్ మరియు సినీ వర్గాలు అసలు అల్లు అర్జున్ కి నిద్ర పట్టట్లేదు ఏమో అని అనుకుంటున్నారు.