న్యూస్

Pushpa: మొండేలు (కేశవ) పుష్ప ను ముంచేస్తాడా?

Pushpa part two story leaked
Share

Pushpa: డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప ది రైస్’ పెద్ద సక్సెస్ గా నిలిచింది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది అని మనకి తెలిసిన విషయమే.మొదటి భాగం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మీద సాగింది. ఈ పార్ట్ సక్సెస్ అయింది, దీంతో రెండో భాగంపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగిపోయాయి.

 

Pushpa part two story leaked

అల్లుఅర్జున్ ఒక మామూలు కూలీగా జీవితాన్ని మొదలుపెట్టి స్మగ్లింగ్ సిండికేట్ లో అంత ఎత్తుకి ఎలా ఎదిగాడు అని మనకి మొదటి భాగంలో చూపించారు. ఇక పోతే రెండో భాగం ‘పుష్ప ది రూల్’ లో పుష్ప తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు అని చూపించబోతున్నారు.

అందరూ ‘పుష్పా’ ని రెండు భాగాలుగా తీస్తున్నాము అని వినగానే ‘బాహుబలి’ ‘కే.జి.ఎఫ్’ లతో కంపేర్ చేశారు. అయితే ‘పుష్పా ది రైస్’ బాహుబలి తరహాలో కాకుండా ‘కే.జి.ఎఫ్’ లో లాగా హీరో ఏం చేయబోతున్నాడు అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించే ముగింపు ఎంచుకున్నారు.

పుష్ప మొదటి భాగంలో దాక్షాయిని, మంగళం సీను, బన్వర్ సింగ్ షెకావత్,జాలి రెడ్డి వంటి విలన్ పాత్రలకు ముగింపు ఇవ్వలేదు.రెండో భాగంలో వీళ్ళందరూ హీరో మీద ప్రతీకారం తీర్చుకోవటానికి చూస్తాయి. ఇదిలా ఉండగా రెండో భాగంలో లో క్రేజీ గాసిప్ వైరల్ అవుతుంది- ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది అని అనుకుంటున్నారు.

అల్లు అర్జున్ పక్కన ఉండే మొండేలు (కేశవ) పాత్రకు మొదటి భాగంలో చాలా ప్రాధాన్యత ఉంది, ఎంత ప్రాధాన్యత అంటే సినిమా మొత్తం ఆ పాత్ర తోనే నరెట్ చేయబడుతుంది. అయితే రెండో భాగంలో మొండేలు (కేశవ) పుష్ప రాజ్ కు వెన్నుపోటు పొడిచి శత్రువుగా మారతాడని మనకు అందిన సమాచారం.దీంట్లో నిజం ఎంత ఉందో తెలీదు, కానీ ఈ ట్విస్ట్ పార్ట్ 2 లో ఆసక్తికరమైన అంశంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు.


Share

Related posts

AP Cinema: సినిమా వాళ్లకే సినిమా కనబడుతున్నట్లుందే..!? ప్రేక్షకులు  మాత్రం హాపీ..!!

somaraju sharma

Shanmukh: షన్నుని ఏకేస్తున్న అభిమానులు.. వాలైంటైన్ డే స్పెషల్ ఏంటి? అంటూ సెటైర్లు!

Ram

బిగ్ బాస్ 4: జబర్దస్త్ అవినాష్ కలలు సాకారం చేసిన బిగ్ బాస్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar