Pushpa: స్టైలిష్ స్టార్ ఇమేజ్ నుంచి పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. మొదటిసారి పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న ఈ అల్లు హీరో నెవర్ బిఫోర్ అనేంత మాస్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. ఓ లారీ డ్రైవర్ ఎలా ఉంటాడో అతని వాలకం ఎలా ఉంటుందో సుకుమార్ అద్భుతంగా మేకోవర్ చేసి చూపించాడు. పుష్ప రాజ్ ఫస్ట్‌లుక్ వచ్చినప్పటినుంచే ఈ సినిమా మీద అంచనాలు అలా అలా పెరుగుతూ వచ్చాయి. ఆ అంచనాలు ఇప్పుడు భారీ స్థాయిలో పెరగగా..ఇప్పుడు ప్రమోషన్స్‌తో సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లోనూ ఊహకందనంతగా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకు ఉదాహరణ తాజాగా హిందీలో టీజర్‌తో మొదలుపెట్టిన ప్రమోషన్స్‌తో పాటు ఈ నెల 6న పుష్ప ట్రైలర్ రాబోతుండగా తాజాగా దాని ప్రోమో టీజర్‌ను రిలీజ్ చేసింది సుకుమార్ బృందం. ఈ రెండు లేటెస్ట్ అప్డేట్స్తో పుష్ప సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో సుకుమార్ చెప్పకనే చెప్పాడు. బాహుబలి తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో మన స్టార్ హీరోలు మార్కెట్ మీద పట్టు సాధించేందుకు తాపత్రయపడుతున్నారు. ఇక పుష్ప సినిమా బాలీవుడ్లో అల్లు అర్జున్, సుకుమార్‌లకు డెబ్యూ సినిమా. అందుకే ఇద్దరు ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Pushpa: సమంత చేస్తున్న ఐటెం సాంగ్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకువెళ్ళడం గ్యారెంటీ..!
సుకుమార్ రంగస్థలం తర్వాత తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ సినిమాలో ప్రతీ ఒక్కరి మేకోవర్ చాలా విభిన్నంగా ఉంది. అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నల లుక్స్ ఎంత మాసివ్‌గా ఉన్నాయో ఇప్పటికే అందరూ చూసేశారు. వారితో పాటు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ పాత్రలు కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయని తాజాగా వదిలిన టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక సమంత చేస్తున్న ఐటెం సాంగ్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకువెళ్ళడం గ్యారెంటీ అంటున్నారు. ఇటీవల బాలీవుడ్లో పుష్ప ప్రమోషన్స్ మొదలుపెట్టిన అల్లు అర్జున్ మాస్ అంటే ఏంటో చూస్తున్నాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?