Oo antava.. oo oo antava: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీలో వీడియో సాంగ్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఊ అంటావా మామ ఊ ఊ అంటావా అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది. నిన్నటి వరకు కేవలం లిరికల్ వీడియో మాత్రమే అందుబాటులో ఉండగా తాజాగా ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్ విడుదల అయ్యింది.
ఇందులో సమంత డ్యాన్స్ చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే వాళ్ల నిరీక్షణకు ఈరోజుతో తెరపడింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ లో మాత్రమే ఈ పాట విడుదల అయింది. కేవలం ఒక గంటలోనే ఈ పాటకు 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇదిలా ఉండగా ఈరోజు సాయంత్రం 8 గంటల నుంచి పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమా ఓటీటీ విడుదలకి కొద్ది గంటల ముందుగానే ఐటమ్ సాంగ్ విడుదలై అందరినీ ఉర్రూతలూగిస్తోంది.