NewsOrbit
న్యూస్

Pushpa: ఈ రికార్డు చూస్తే నయా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అనక తప్పదు..!

Pushpa srivalli gets rare record

Pushpa: అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ ఇప్పటికీ రికార్డుల మోత మోగిసస్తూనే ఉంది. హిందీలో అయితే ఈ సినిమాకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ స్టార్స్ మొదలుకొని అంతర్జాతీయ వ్యాప్తంగా క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు ఈ సినిమా ను తెగ పొగిడేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ మేనరిజమ్స్, డాన్స్ లను వీడియోల రూపంలో చేస్తున్నారు.

 

Pushpa srivalli gets rare record

ఇవన్నీ పక్కన పెడితే అల్లుఅర్జున్ అనుకోకుండా ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. గతంలో కూడా అల్లు అర్జున్ నటించిన చిత్రం లోని పాటలు 100 మిలియన్ వ్యూస్ పైగా సాధించాయి. ఇక యూట్యూబ్లో తెలుగు సినిమా పాటలు 100 మిలియన్ వ్యూస్ దక్కించుకోవడం చాలా పెద్ద విషయం గా భావించారు.

అయితే అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠ పురంలో’ పాటలు వరుస పెట్టి ఈ ఘనత సాధించాయి. ఆ తర్వాత చాలా తెలుగు పాటలు ఈ మార్క్ అందుకున్నాయి. అయితే పుష్ప సినిమాలోని శ్రీవల్లి తెలుగు వర్షన్ 130 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇది టాలీవుడ్ జనాలకి పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీవల్లి హిందీ వర్షన్ కూడా 100 మిలియన్ పైగా వ్యూస్ దక్కించుకుంది.

ఒక తెలుగు పాట లేదా ఇతర దక్షిణ భారతదేశ భాష లో చిత్రీకరించిన పాట హిందీలో డబ్ అయి 100 మిలియన్ వ్యూస్ సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఇక ఈ అరుదైన రికార్డు శ్రీవల్లి దక్కించుకోవడంతో అల్లుఅర్జున్ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ సినిమాలో ప్రతి పాట కూడా సూపర్ హిట్. ఈ మధ్యకాలంలో ఒక సినిమా పాటలు ఇంతలా హిట్ కావడం అలాగే ఇతర భాషల్లో కూడా రికార్డు సాధించడం జరగలేదు.

ఇక శ్రీవల్లి స్టెప్ కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. అన్ని భాషల వారు విపరీతంగా ఇష్టపడిన పుష్ప సినిమా రానున్న రోజుల్లో మరెన్ని రికార్డులు కొడుతుందో చూడాలి. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగిపోయాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!