Pushpa : అల్లు అర్జున్.. ఇపుడు ఇండియన్ సినిమా మార్కెట్ ని షేక్ చేస్తున్న పేరు. అవును. ఇటీవల విడుదలైన పుష్ప సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో అంతంతమాత్రమే ఆడినా, బాలీవుడ్లో మాత్రం కుమ్మేసింది. తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన బన్నీ.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇతర ఇండస్ట్రీలలో కూడా తెలుగు మార్కెట్ ఓపెన్ చేసిన ఘనత మాత్రం మన హీరోదే. పుష్ప ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా హిందీలో 100 కోట్ల వసూళ్లు రాబట్టి బాలీవుడ్ మార్కెట్ ని ఆశ్చర్యపరిచింది.
Pushpa : పుష్ప vs బాలీవుడ్:
పుష్ప సినిమా బాలీవుడ్ లో క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. అక్కడ యూత్ అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గత హిందీ డబ్బింగ్ చిత్రాలను వరస పెట్టి యూట్యూబ్ లో చూసేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి చిన్న వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ మున్నీ నటనను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అదంతా ఒకెత్తయితే, సినిమాలో అతని మేనరిజమ్స్ అన్నీ బయట ఫాలో అవుటుడటం విశేషం. నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఎంతోమంది రీల్స్ చేసి వరల్డ్ పాపులారిటీ తీసుకొచ్చారు.
బాలీవుడ్ లో బన్నీ స్ట్రెయిట్ సినిమా?
ఇకపోతే పుష్పకు అక్కడ 100 కోట్లమేర వసూళ్లు రావడంతో.. ఇపుడు బన్నీ అక్కడ పైసా వసూల్ రాజా అయిపోయాడు. అవును… అక్కడి ప్రేక్షకులు అక్కడ ఖాన్లను వద్దని, మన సౌత్ హీరోలే ముద్దని అంటున్నారు. దాంతో అతనితో స్ట్రైట్ హిందీ సినిమా చేయాలని అక్కడి నిర్మాతలు కాచుకు కూర్చున్నారు. ఇక మనోడిదే ఆలస్యం. సందు దొరికిందా అక్కడ బన్నీని లాక్ చేసి పడేస్తారు. ఎంతైనా పుష్ప అంటే ప్లవరు మాత్రం కాదు.