House: ఇంటి పైన   దీన్ని పెట్టించుకుంటే  తలనొప్పి తప్పదట !!

Share

House: టెలికాం కంపెనీ
ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్స్ వాడుతున్నారు. దానికి అనుగుణం గా ప్రముఖ టెలికాం కంపెనీలు అన్నీ కూడా   తమ నెట్వర్క్ కి వినియోగదారులు బాగా పెరగాలన్న ఉద్దేస్యం తో ఉన్నారు.టెలికాం కంపెనీల మధ్య ఉన్న విపరీతమైన పోటీ వలన  మార్కెట్ లో  నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు  చేస్తూ  వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి అనే  ప్రయత్నాలు   చేస్తున్నారు.

House: ఇంటి మీద పచ్చటి వాతావరణం

ఇంతకు ముందు  భారీగా ఉండే ధరలను ఇప్పుడు తగ్గించి వినియోగదారులను    తమ వైపు ఆకర్షించే   ప్రయత్నాలు చేస్తున్నాయి టెలికాం సంస్థలు.  ఈ ప్రణాళికలో భాగం గా  సిగ్నల్  నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా   అందించడానికి   సెల్ టవర్ల సంఖ్యను  విపరీతం గా పెట్టేస్తున్నారు.   మెరుగైన సిగ్నల్ అందించడం కోసమని టవర్లను ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేసే    క్రమంలో   ఒక ఆసక్తికర విషయం  వెలుగులోకి వచ్చింది.  సెల్ టవర్ల  కోసం సిటీ ప్రాంతాల్లో భారి ఆపార్ట్మెంట్ లను, మోస్తారు ఇళ్ళను అద్దెకు తీసుకుంటూ వాటిపై సెల్ టవర్ ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా ఇప్పటికే పెట్టబడిన వాటిని  వాటిని తమ ఇంటి మీద నుంచి తీసేయాలని..తమకు అద్దె కూడా అవసరం లేదని ఇంటి యజమానులు మొత్తుకుంటున్నారట.  దీనికి కారణాలు  చూస్తే… ఇది వరకు ఇంటి మీద పచ్చటి వాతావరణం ఉండేదని, దీనితో పెద్ద మొత్తం లో  పక్షులు వచ్చి సందడి చేస్తూ ఉండేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేక తమ ఇల్లు కళ విహీనం గా ఉన్నాయి అని వారు ఆవేదన  చెందుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో

అదే విధంగా టవర్ల ఏర్పాటు  చేయడం వలన  వచ్చే రేడియేషన్ తో పక్షులు చనిపోవడమే కాకుండా, తమకు తల నొప్పి కూడా వస్తుందని వారు తెలియచేస్తున్నారు. దీనితో ఇప్పుడు చాలా మంది తమకు అద్దె రాకపోయినా పర్వాలేదు కానీ  తమ ఇంటి మీద టవర్ మాత్రం  వద్దని నిక్కచ్చిగా తెలియచేస్తున్నారట.జనాలలో వచ్చిన ఈ మార్పుతో   టెలికాం కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో  ఈ సమస్య  ఎక్కువగా ఉందట


Share

Related posts

Harish Rao: హరీశ్ రావుకు అవ‌కాశం ఇస్తున్నారా… షాక్ ఇవ్వ‌నున్నారా?

sridhar

TRS : సడన్ గా సౌండ్ పెంచిన గులాబీ ఎమ్మెల్యేలు! ఏమిటో వారి ఆంతర్యం?

Yandamuri

Oxymeter: షాక్ః ఆక్సిమీట‌ర్ వాడితే బ్యాంకులో డ‌బ్బులు క‌ట్‌

sridhar