NewsOrbit
న్యూస్

టీడీపీకి పెద్ద దెబ్బ కొట్టిన ఏబీఎన్ ఆర్కే..!

radha krishna kotha paluku comments irks chandrababu naidu

తెలుగు మీడియాలో ఎలక్ట్రానికి, ప్రింట్ మీడియా ఏదొక రాజకీయ పార్టీకి అనుబంధంగానే కొనసాగుతున్నాయి. జగన్ కు సాక్షి, టీడీపీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి. అయితే.. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు టీడీపీకి దెబ్బ కొట్టేలా ఉంటున్నాయి. చంద్రబాబుకు బాకా ఊదే క్రమంలో దారుణమైన తప్పిదాలు చేస్తున్నారు. దీంతో సాధారణ పాఠకులే కాకుండా టీడీపీ అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. కొత్తపలుకులో ఆయన నిన్న రాసిన రాతలే ఇందుకు ఉదాహరణ.

radha krishna kotha paluku comments irks chandrababu naidu
radha krishna kotha paluku comments irks chandrababu naidu

జగన్ మీద కేసులకు చంద్రబాబు కారణమా..? దారి మళ్లించిన రాధాకృష్ణ..

సీఎం జగన్ మీద సీబీఐ 11 కేసులు నమోదు చేసి ఏ1గా పేర్కొంటూ చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 43వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ అభియోగాలు చేసింది. ఇప్పటికీ ఈ కేసుల్లో జగన్ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ కేసుల విషయంలో సోనియా కక్షగట్టారని, కోర్టులు సీబీఐకి అధికారాలు ఇచ్చిందనే ఇన్నాళ్లూ అనుకున్నారు. చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ ఆరోపించినా ఎవరూ నమ్మలేదు. కానీ.. నిన్న ఆర్కే కొత్తపలుకు రాతలు కొన్ని అనుమానాలు రేకెత్తెస్తున్నాయి. జస్టిస్ ఈశ్వరయ్యను న్యాయమూర్తిగా నియమించడంలో చంద్రబాబే కీలకంగా వ్యవహరించారనీ జగన్ పై సీబీఐ కేసులు, తీర్పుల విషయంలో కూడా ఈశ్వరయ్యే కీలక పాత్రనీ ఆర్కే రాశారు. అంటే జగన్ పై కేసుల విషయంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆర్కే నేరుగా ఒప్పుకున్నట్టైంది. దీంతో చంద్రబాబును, న్యాయమూర్తులను, న్యాయ వవస్థను అనుమానించే పరిస్థితి కల్పించారు. దీంతో పాఠకుల్లో.. వైసీపీ వర్గాల్లో టీడీపీపై, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అర్కేను అసహ్యించుకునేలా చేసారు.

అతి తెలివి ఇంత దెబ్బ తీసిందా..!

ఆర్కే తన రాతల్లో చంద్రబాబుకు మేలు చేసేలానే ఊహించుకుని రాస్తారు. అంతిమంగా ఫలితం మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తుంది. గతంలో అనేక సందర్బాల్లో కేసీఆర్, చంద్రబాబు పాలనపై పోలిక పెడుతూ రాసిన రాతలతో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగింది. ప్రస్తుతం జగన్ పై ఏపీలో సానుకూలత ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాసి చంద్రబాబుకు మరింత నష్టం చేకూరుస్తున్నారు. ఈ రాతలను చంద్రబాబు, ఆర్కే ఎంతమేర సమర్ధించుకుంటారో తేలాల్సిన విషయం.

author avatar
Muraliak

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N