Radhe shyam : రాధే శ్యామ్ Radhe shyam టీజర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కి పండుగ రోజులు మొదలవనున్నాయి. రెండేళ్ళుగా ప్రభాస్ నుంచి సినిమా రాకపోవడం తో ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఉన్నారు. ఇక రాధే శ్యామ్ సినిమా నుంచి మేకర్స్ సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం తో ఇన్నాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్ డీలా పడ్డారు. అంతేకాదు మధ్య లో ట్రోల్ కూడా చేశారు. అందరి సినిమా అప్డేట్స్ వచ్చి తమ అభిమానులని ఉత్సాహపరుస్తుంటే ప్రభాస్ మాత్రం ఆ ఉత్సాహాన్ని ఇవ్వలేకపోతున్నాడని చెప్పుకున్నారు. కాని ఇక నుంచి అందరికంటే .. అన్ని సినిమాల కంటే మించి రాధే శ్యామ్ అప్డేట్స్ ఉంటాయని తాజా సమాచారం.
మరికొన్ని గంటల్లో రాధే శ్యామ్ నుంచి టీజర్ గ్లింప్స్ రాబోతోంది. ఇప్పటికే ఈ గ్లింప్స్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ తో ఉన్న చిన్న ప్రీ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ గ్లింప్స్ కి డబ్బింగ్ పూర్తి చేసినట్టు హీరోయిన్ పూజా హెగ్డే కూడా సోషల్ మీడియాలో డబ్బింగ్ థియేటర్స్ లో ఉన్న ఫొటో ని షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది. కాగా తాజాగా ఒక న్యూస్ బయటకి వచ్చింది. ఇంకొన్ని గంటల్లో రాధే శ్యామ్ నుంచి టీజర్ గ్లింప్స్ రాబోతుండగా .. ఆ టీజర్ గ్లింప్స్ తర్వాత నుంచి వరసగా సర్ప్రైజెస్ ఇవ్వడానికి టీం ప్లాన్ చేశారట.
Radhe shyam : సమ్మర్ లో రాధే శ్యామ్ రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజెస్ రానున్నాయి.
ఇన్ని నెలల నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ మిస్ అయిన సర్ప్రైజెస్ ని ఇక నుంచి కంటిన్యూస్ గా ఇవ్వాలని ప్రభాస్ దర్శక, నిర్మాతలకి చెప్పినట్టు సమాచారం. అలాగే దర్శకుడు రాధకృష్ణ రాధే శ్యామ్ టీజర్ తర్వాత లిరికల్ సాంగ్స్.. పోస్టర్స్.. ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండటానికి ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ లో రాధే శ్యామ్ రిలీజ్ అయ్యే వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ సర్ప్రైజెస్ రానున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్ తో పాటు ఆది పురుష్ సినిమాలు చేస్తున్నాడు. సలార్ ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది.