బాధ్యతలు చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్

77 views

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణా హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఉదయం జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తదితర ప్రముఖులు హజరయ్యారు. అనంతరం తెలంగాణాకు కేటాయించిన ఇతర న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణ  హైకోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేయించారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తులు 24మంది కాగా ప్రస్తుతం 13మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరితోనే తెలంగాణా హైకోర్టు మంగళవారం ప్రారంభమైంది.