Radhe shyam : రాధే శ్యామ్..యంగ్ రెబల్ స్టార్ క్రేజీ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్. లైలా – మజ్ఞు, దేవదాసు – పార్వతి, సలీం – అనార్కలి లాంటి ప్రేమకథను రాధే శ్యామ్ లో విక్రమాదిత్య – ప్రేరణలమధ్యన సాగుతుందట. ప్రభాస్ పెదనాన్న అయిన సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ మేకర్ భూషణ్ కుమార్ కలిసి గోపీకృష్ణ మూవీస్, టీ సీరీస్ బ్యానర్ సమర్పణలో యూవి క్రియేషన్ అధినేతలు వంశీ ప్రమోద్ లతో పాటు ప్రభాస్ చెల్లి ప్రసీద 250 పైన భారీ బడ్జెట్ కేటాయించి నిర్మిస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందట. మిగిలి ఉన్న షూటింగ్ ని ఓ 10 రోజుల్లోపు పూర్తి చేసి పరిస్థితులు అనుకూలిస్తే మేకర్స్ ప్రకటించినట్టుగా జూలై 30న అన్నీ ప్రధాన భాషలతో పాటు పాన్ ఇండియన్ స్థాయిలో మిగతా భాషలలోనూ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట. అంతేకాదు పే ఫర్ వ్యూ పద్దతిన థియేటర్స్ రిలీజ్ తో పాటు డిజిటల్ రిలీజ్ కూడా చేయనున్నారట. ఇప్పటికే భారీ స్థాయిలో బిజినెస్ కూడా జరిగిందట.
Radhe shyam : రాధే శ్యామ్ ఏమేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
త్వరలో ప్రమోషన్ మొదలు పెట్టి అభిమానులకు, యావత్ సినీ ప్రేమికులకు సర్ప్రజెస్ మీద సర్ప్రైజెస్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే 1960 కాలం నాటి అద్భుతమైన ప్రేమకథతో పాటు ఊహించని ట్విస్టులు, థ్రిల్లర్ అంశాలు, ఉన్నాయని తెలుస్తోంది. అవన్నీ ఎంతో కొత్తగా ఉండేలా దర్శకుడు రాధకృష్ణ కుమార్ ప్లాన్ చేశాడట. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరిస్తుందని మేకర్స్ ఎంతో నమ్మకంగా చెబుతున్నారట. ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి 10 ఏళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న లవ్ స్టోరి రాధే శ్యామ్ ఏమేరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.