న్యూస్ సినిమా

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమాలో భారీ ప్రయోగం..! సక్సెస్ అయితే హిట్… లేకపోతే ఫట్?

Radhe shyam pair
Share

Radhe Shyam: ప్రభాస్ , పూజ హెగ్డే ముఖ్య పాత్ర ధారులుగా రాధేశ్యామ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రభాస్ సాహో సినిమా వచ్చి రెండు సంవత్సరాలు కావడంతో అభిమానులు రాధేశ్యామ్ సినిమా గురించి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పాటలు అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇలాంటి తరుణంలో భారీ ప్రయోగాలతో హీరో హీరోయిన్ ల మీద ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

Radhe shyam pair

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. కొన్ని సినిమాలు గ్రాఫిక్స్ తో వెండితెరపై అద్భుతాలను సృష్టించాయి. ఇలాంటి ట్రెండ్ ఇప్పుడు బాగా పెరిగి, సినిమా గ్రాఫిక్స్ మీద భారీగా ఖర్చు పెడుతున్నారు.

ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో హీరో హీరోయిన్లు లేకుండా కేవలం విఎఫ్ఎక్స్ , కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి ఒక పాట చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ రొమాంటిక్ సాంగ్ తెరకెక్కించటానికి పూజా హెగ్డే కాల్షీట్లు అందుబాటులో లేవు పైగా అలాంటి రొమాంటిక్ సాంగ్స్ లో చేయాలంటే ప్రభాస్ కి సిగ్గు ఎక్కువ. అందుకే విఎఫ్ఎక్స్ సహాయంతో మరియు డూప్ లతో ఈ పాటను పూర్తి చేశారట. క్లోజప్ షాట్స్ లో మాత్రం ప్రభాస్, పూజ ల ముఖాలే కనిపిస్తాయట.

ప్రేమ కథ చిత్రాలకు ప్రాణం పోసేది రొమాంటిక్ సాంగ్స్. రాధేశ్యామ్ లాంటి లవ్ స్టోరీ లో రొమాంటిక్ సాంగ్స్ గురించి అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటిది సాంగ్ లో హీరో హీరోయిన్లు లేకపోతే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ ఫార్ములా సక్సెస్ అయితే సినిమా హిట్ లేదా వాళ్ళ ప్రయత్నం విఫలించినట్టే.


Share

Related posts

మొన్న బెస్ట్ సీఎం.. తాజాగా దేశవ్యాప్తంగా మరో ఘనత సాధించిన జగన్ సర్కార్..!!

sekhar

పాయ‌ల్ స్పెష‌ల్‌

Siva Prasad

Bigg Boss 5 Telugu: వీకెండ్ ఎపిసోడ్ లో షణ్ముక్ కి స్పెషల్ సర్ప్రైజ్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar