జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్”. ప్రభాస్ సోదరి ప్రశీద ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. వంశీ, ప్రమోద్ లతో కలిసి నిర్మాతగా వ్యవహరిస్తుంది ప్రశీద. గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ భారీ బడ్జెట్ తో “రాధే శ్యామ్” ని నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమాకి ముందు నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు ఈ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ “బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్” అని మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు.
దాంతో అందరిలోను ఈ సినిమాకి సంగీతమందించేదెవరు అన్న పెద్ద సందేహంలో ఉన్నారు. చెప్పాలంటే కొన్ని సార్లు సాహో సినిమాతోను పోల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి ఏ ఒక్కరు ఇమాజిన్ చేసుకోలేని మ్యూజిక్ డైరెక్టర్ ని “రాధే శ్యామ్” కి సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నట్టు సమాచారం. యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ అన్న మాట ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.
జస్టిన్ ప్రభాకర్ తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన “డియర్ కామ్రేడ్” సినిమాకి మాత్రమే సంగీతమందించాడు. మ్యూజిక్ పరంగా బాగానే ఉన్నప్పటికి సినిమా ఫ్లాపవడంతో ఎవరూ అంతగా జస్టిన్ ప్రభాకర్ ని పట్టించుకోలేదు. కానీ మళయాళం, తమిళ్ లో సూపర్ హిట్ మ్యూజిక్ అందించాడు. అయితే ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియన్ సినిమాకు కూడా సంగీతం అందించలేదు. మరి ఎలా ఛాన్స్ ఇచ్చారన్నది ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది మేకర్స్ అఫీషియల్ గా వెల్లడిస్తేనే నమ్మగలం.