Radhe shyam : రాధే శ్యామ్ టీజర్ గ్లింప్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. తాజాగా రాధే శ్యామ్ నుంచి టీజర్ గ్లింప్స్ రిలీజయింది. టీజర్ లో ఉన్న డైలాగ్స్ తో రాధే శ్యామ్ డిఫ్రెంట్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా’..? అన్న పూజా హెగ్డే డైలాగ్ కి డార్లింగ్ ప్రభాస్ ‘ఛ.. వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేనా టైప్ కాదు’ అంటూ ఇచ్చిన సమాధానంలోనే రాధే శ్యామ్ కథ ఏంటో అర్థమవుతోంది. ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్ లో ప్రభాస్ విక్రమాదిత్య గా పూజా హెగ్డే ప్రేరణ గా కనిపిస్తున్నారు.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయిన రాధే శ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులనే కాదు ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ ఫస్ట్ గ్లింప్స్ ని తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా మిగతా హిందీ వెర్షన్ కి మిథున్ మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక బాహుబలి .. సాహో సినిమాలలో చూసిన ప్రభాస్ కి భిన్నంగా రాధే శ్యామ్ లో కనిపిస్తున్నాడు. పీరియాడికల్ రొమాంటిక్ సినిమాగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతోంది.
Radhe shyam : రాధకృష్ణ ఎంచుకున్న ఇటలీ నేపథ్యం సినిమాకి ప్లస్ అని గ్లింప్స్ లో తెలుస్తోంది.
ఇక దర్శకుడు రాధకృష్ణ ఎంచుకున్న ఇటలీ నేపథ్యం సినిమాకి ప్లస్ అని గ్లింప్స్ లో తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ కలిసి 250 కోట్ల భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ ని నిర్మిస్తుండగా జూలై 30 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు కూడా తాజాగా రిలీజ్ చేసిన గ్లింస్ లో వెల్లడించారు మేకర్స్. కృష్ణం రాజు, భాగ్యశ్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిన్న షెడ్యూల్ తప్ప మిగతా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిందని సమాచారం. మొత్తానికి వాలెంటైన్స్ డే కి డార్లింగ్ ప్రభాస్ ఇచ్చిన లవ్లీ ట్రీట్ అదిరిపోయింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!