Prabhas: ఎప్పటినుండో ప్రభాస్ అభిమానులు.. ఎదురుచూస్తున్న వార్త ….??

Share

Prabhas: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేసిన సాహో సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరంన్నరకు పైగానే జరిగింది. అంత భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా టైమ్ తీసుకుని ప్రభాస్ సినిమా చేయడంతో “సాహో” సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే సినిమా ఫస్ట్ షో పడ్డా గానే.. అట్టర్ ప్లాప్ టాక్ సొంతం చేసుకోవడంతో తీవ్ర నిరాశ లోకి వెళ్ళిపోయారు అభిమానులు. ఏకంగా సంవత్సరంన్నర టైం అట్టర్ ఫ్లాప్ సినిమా ప్రభాస్ కేటాయించడంతో.. పాటు ఆ తరువాత “రాధేశ్యాం” సినిమా.. షూటింగ్ ఆలస్యం అవటంతో ఆ సమయంలో సోషల్ మీడియాలో ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు మానేసాడు అనే సందేహం నెలకొంది.

Here's Dapper Prabhas in 'Radhe Shyam' Look Pic Ahead of Teaser on  Valentine's Day

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా టైం పట్టడంతో పాటు కరోనా రాకతో.. మరింత ఆలస్యం అవటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమాకి సంబంధించి బ్యాలెన్స్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవటమే కాక తాజాగా పోస్ట్ప్రొడక్షన్ పనులు కూడా.. చివరి దశకు చేరుకోవడంతో సినిమా మేకర్స్ త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడానికి ఓ ఈవెంట్ సెట్ చేసినట్లు సమాచారం.

Read More: Prabhas: ప్రభాస్ చేయాల్సిన సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్..??

పాన్ ఇండియా లెవెల్ లో… ఈ సినిమా తెరకెక్కడం జరిగింది. దీంతో భారీ ఎత్తున… ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సినిమా యూనిట్ డిసైడ్ అయింది. మరోపక్క ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తూనే “సలర్” కూడా త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఏది ఏమైనా చాలా కాలం తర్వాత ప్రభాస్ సినిమా రిలీజ్ తేదీ ప్రకటన వస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులు..ఫుల్ హ్యాపీగా ఉన్నారు.


Share

Related posts

హైద‌రాబాద్ జ‌ట్టుకు షాక్‌.. ఐపీఎల్ టోర్నీకి పేస్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ దూరం..

Srikanth A

Marriage: పెళ్ళికి ముందు ఊహించుకున్న జీవితం పెళ్ళి తర్వాత ఉండక పోవడానికి కారణం ఇదే!!(పార్ట్-1)

Kumar

Prabhas : ప్రభాస్ కి కళ్ళు చెదిరే ఆఫర్ ఇచ్చిన బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్స్ హౌస్..!!

sekhar