బోల్డ్ పాత్రలతో గుర్తింపు పొందింది రాధికా ఆప్టే. అటు బాలీవుడ్ తో పాటు, తెలుగు సినిమాల్లో కూడా నటించింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన రాధికా, ఆ తర్వాత బాలయ్య సరసన లెజండ్, లయన్ చిత్రాల్లో నటించింది.
అయితే కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. సినిమా కెరీర్ లో అవకాశాల కోసం పూణే నుండి ముంబై వద్దామనుకున్నప్పుడు నన్ను వద్దని వారించిన వారే అందరూ. బాలీవుడ్ లో నువ్వు నెగ్గుకురాలేవని చెప్పి నన్ను నిరుత్సాహపరిచారు. నిన్ను రేప్ చేస్తారు అని భయపెట్టడానికి చూసారు. లైంగిక వేధింపులు తప్పవన్నారు. అయితే నేను వెనుకడుగు వేయలేదు. అందుకే ఈ స్థాయిలో ఉన్నాననుకుంటున్నా అని తెలిపింది రాధికా. ప్రస్తుతం ఆమె నటించిన రాత్ అకేలి హై చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.