Chiranjeevi: రాధిక అలనాటి అందాల నటి మళ్ళీ బుల్లితెరపై సందడి చేస్తోంది.. తాజాగా మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, వారి మధ్య జరిగిన తమాషా సంఘటనలు పంచుకున్నారు.. ఆ విషయాలను రాధికా మనతో పంచుకుంటూ.. చిరంజీవితో నా కెరీర్ మొదలైంది..

చిరంజీవి నేను కలిసి నటించిన న్యాయం కావాలి అనే నా తొలితెలుగు సినిమా హీరో ఆయనే. ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించాం. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. న్యాయం కావాలి షూటింగ్ లో కలసిన మొదటిరోజు నుంచే మా మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. అప్పటి నుంచి మేము మంచి స్నేహితులుగా ఉన్నాం. అప్పట్లో మా ఇద్దరి గురించి చాలా రూమర్స్ వచ్చాయి. అయితే మా మధ్య స్నేహం తప్ప మరేం లేదు. న్యాయం కావాలి సినిమా కథలో భాగంగా చిరంజీవిని చెంపపై నేను కొట్టాలి. చిరంజీవిని చూస్తూ నేను ఆ సీన్ సరిగ్గా చేయలేకపోయాను.
ఆ సీన్ లో 24 సార్లు టేక్ తీసుకున్నాను. అంటే చిరంజీవిని 24 సార్లు చెంపదెబ్బ కొట్టాను. దాంతో అయన చెంప బాగా వాచిపోయి ఎర్రగా కందిపోయింది. అప్పుడు చిరంజీవికి నేను సారీ చెప్పాను. ఆ అందుకు చిరంజీవి పరవాలేదు అమ్మా. నా చెంపను బాగానే వాయించవమ్మా అంటూ నవ్వారు అని ఓ విషయాన్ని ఆమె పంచుకున్నారు.