రఫెల్ పై రాహుల్, జైట్లీ పరస్పర ఆరోపణలు

69 views

ఢిల్లీ, జనవరి 2: రఫేల్ స్కాం పార్లమెంట్‌ను కుదిపేసింది. బుధవారం పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రఫేల్ స్కాం గురించి ప్రస్తావించారు. దేశ రక్షణకు సంబంధించిన రఫెల్ యుద్ద విమానాల కొనుగోలు కాంట్రాక్టును అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌కు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. దీనిపై గోవా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల రికార్డును సభలో ప్రస్తావించారు. ఈ విమానాల సంఖ్య, ధరలను ఎవరు నిర్ధారించారో సభలో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేయాలని కోరారు. ప్రధానమంత్రి మోదీకి ధైర్యంలేకనే సభలోలేకుండా పోయారన్నారు.
రాహుల్ అబద్ధాలు చెబుతున్నారని కేంద్ర ఆర్ధికశాఖామంత్రి అరుణ్‌జైట్లీ తిప్పి కొట్టారు. సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో సంతృప్తి వ్యక్తం చేసింది కానీ, కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు తృప్తి కలుగలేదన్నారు. యుద్ధ విమానాల ధరలు, పరికరాలకు సంబంధించిన వివరాలు దేశ అంతర్గత భద్రతకు సంబంధించినవని చెప్పారు. 2011లో ఇండియన్ ఎయిర్ ఫోర్సు యుద్ధ విమానాలు కావాలని ప్రతిపాదన చేసిందన్నారు.
ప్రధానమంత్రి మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నప్పుడే రఫేల్ గురించి విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారని అరుజైట్లీ సభకు తెలిపారు. గతంలో బోఫోర్స్‌పై జెపిసి నియమిస్తే ఆ సంఘమే మరో స్కామ్‌కు పాల్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.