ప్రస్తుతం బుల్లితెర మీద ఎక్కువ హడావుడి చేస్తున్నది ఎవరు అంటే గుజరాత్ సుందరి, బిగ్ బాస్ 4 బ్యూటీ మోనల్ గజ్జర్. అవును.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లక ముందు వరకు కూడా తనెవరో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ.. ఎప్పుడైతే మోనల్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందో.. అందరికీ పరిచయం అయింది. తనలోని టాలెంట్ కూడా బయటపడింది.

బిగ్ బాస్ హౌస్ లో తన ట్రయాంగిల్ లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ అయింది. ఒక్క ఏ.. అనే పేరుతో హౌస్ లో ఉన్నన్ని రోజులు తను చేసిన హడావుడి మామూలుది కాదు.
బిగ్ బాస్ హౌస్ నుంచి మోనల్ బయటికి వచ్చాక.. తన రేంజ్ మారిపోయింది. సినిమాల్లో అవకాశాలు, షోలలో అవకాశాలు.. ఫుల్లు బిజీ అయిపోయింది.
తనకు స్టార్ మా చానెల్ లోనే డ్యాన్స్ ప్లస్ అనే షోలో జడ్జిగా అవకాశం వచ్చింది. ఆ షోలో జడ్జిగా వ్యవహరించడమే కాదు.. రఘు మాస్టర్, యష్ మాస్టర్ ను తన వలలో పడేసుకుంది ఈ సుందరి. అవును.. బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, అభిజీత్ పడిపోయినట్టుగా… డ్యాన్స్ ప్లస్ షోలో రఘు మాస్టర్, యష్ మాస్టర్ తనకు ఫిదా అయిపోయారు.
తనతో కలిసి డ్యాన్సులు, స్టెప్పులు అదిరిపోయాయి. తాజాగా డ్యాన్స్ ప్లస్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూస్తే అదే అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆ ప్రోమోను చూసేయండి మరి..