Raghu rama: రఘురామ అభ్యర్థను తోసిపుచ్చిన హైకోర్టు..! కాసేపటిలో జగన్ బెయిల్ రద్దు పై సీబీఐ కోర్టులో తీర్పు..!!

Share

Raghu rama: ఏపి సీఎం జగన్, ఎంపి విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎంపి రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. దీంతో నాంపల్లి సీబీఐ కోర్టు ఈ రోజు (బుధవారం) తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పిటిషనర్ రఘురామ కృష్ణంరాజు అనూహ్యంగా బెయిల్ రద్దు పిటిషన్ ను మరో న్యాయస్థానానికి మార్చాలంటూ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం సర్వత్రా ఉత్కంఠను రేపింది.

raghuram ple dismissed in Telangana high court
raghuram ple dismissed in Telangana high court

ఓ పక్క సీబీఐ కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందని అని ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న తరుణంలో సీబీఐ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలనీ, వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో నిన్న రఘురామ దాఖలు చేసిన లంచ్ మోహన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.  కొద్దిసేపటి క్రితం హైకోర్టు రఘురామ అభ్యర్థనను తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ కోర్టులో జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడికానుంది.


Share

Related posts

మీకు తిండి పుష్టి ఉందా.. అయితే బుల్లెట్ సొంతం అయినట్టే.. అది ఎలాగో చూడండి..

bharani jella

Today Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి పతనం..!!

bharani jella

మాస్క్ పెట్టకుంటే భారీ జరిమానా.. మీ ఇష్టం!

Teja