NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

Raghuramakrishnamraju: ఈసారి సీబీఐ, జగన్ ఇద్దరిపైకీ..! రెబల్ ఎంపీ మరో బాణం..!!

YS Jagan Bail Case: Over Expectations of That Media

Raghuramakrishnamraju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ పైకి మరో బాణం వేశారు. ఈ సారి జగన్ తో పాటూ.., సీబీఐ, ఈడీని కూడా కోర్టుకి లాగేలా వేశారు. ఈ ఎత్తు ఎంత వరకు పారుతుంది..? ఈయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయనేది కోర్టులు తేల్చనున్నాయి. ఇక సూటిగా విషయంలోకి వెళ్ళిపోతే.. రఘురామా ఈరోజు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసారు. “జగన్ అక్రమాస్తుల కేసుని సీబీఐ, ఈడీ సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని.., దర్యాప్తులో బయటకు వచ్చిన అనేక అంశాలను వదిలిపెట్టాయని.., అర్ధారంతరంగా ముగించకుండా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జగన్ కి వ్యతిరేకంగా కోర్టులో వరుసగా కేసులు వేస్తున్న రఘురామ.. ఇది ఆరో పిటిషన్. ఇప్పటికే జగన్ బెయిల్ రద్దు చేయాలనీ.. ఏపీ సీఐడీ పోలీసులు తనను కొట్టారని దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని.. అమూల్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా.., వరుసగా పిటిషన్లు వేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రెబల్ ఎంపీ, వైసీపీ మధ్య అగాధం మరింత ముదురుతోంది. ఓ వైపు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ దశలో ఉండగానే.. ఇప్పుడు ఈ పిటిషన్ వేయడం సంచలనంగా మారింది..

Raghuramakrishnamraju: Another Twist in RRR vs YSRCP
Raghuramakrishnamraju Another Twist in RRR vs YSRCP

Raghuramakrishnamraju: సీబీఐ కౌంటర్ కీలకం..!

ఈ కేసుని హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అనేది అనుమానమే.. రఘురామా లేవనెత్తిన పాయింట్లు వ్యవస్థీకృతమైనవి కావడంతో కోర్టు విచారణకు స్వీకరిస్తుందా..? లేదా సీబీఐ కోర్టుకి బదిలీ చేస్తుందా అనేది కీలకం కానుంది. ఏది జరిగినా ఒకవేళ సీబీఐ కోర్టుకి పిటిషన్ వెళ్లినా అక్కడ కూడా సీబీఐ వేయనున్న కౌంటర్ కీలకం కానుంది. మొదటి నుండి కేసులు దర్యాప్తు జరిపిన తీరు, ఈ ఏడేళ్ల విరామంలో చేసిన విచారణ అన్నిటినీ నివేదిక రూపంలో కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. సో.. ఈ కేసుల్లో సీబీఐతో పాటూ ఈడీ వేయనున్న కౌంటర్ల ఆధారంగా జగన్ కేసుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

author avatar
Srinivas Manem

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju