రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన పుజారా

సిడ్నీ(ఆస్ర్టేలియా), జనవరి 4: అస్ర్టేలియా గడ్డపై వరుస శతకాలతో సూపర్ ఫాంను కొనసాగిస్తున్న భారత మిడల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. సిడ్నీలో జరుగుతున్న నాల్గవ టెస్టులో ఏడు పరుగుల తేడాతో డబుల్ సెంచరీని మిస్ అయిన పుజారా కంగారులపై దశాబ్ధాల కాలం నాటి రికార్డులను బద్దలు చేశాడు.
అస్ర్టేలియాలో జరిగిన టెస్టు సీరీస్‌లో ఇప్పటి వరకు అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత క్రికెటర్‌గా రాహుల్ ద్రావిడ్ అగ్రస్థానంలో ఉండగా పుజారా ఈ రికార్డును పుజారా బ్రేక్ చేశాడు. 2003-04లో జరిగిన సీరీస్‌లో ద్రావిడ్ 1,203 బంతులను ఆడి రికార్డు నెలకొల్పగా పుజారా ఈ సీరీస్‌లొ 1,258 బంతులతో పాత రికార్డును తుడిచివేశాడు. మూడువ స్థానంలో విజయ్ హజారే(1947-48)లో 1,192బంతులతో, ప్రస్తుత జట్ట కెప్టెన్ విరాజ్ కోహ్లీ(2014-15)లో 1,093 బంతులను ఆడి నాల్గవ స్థానంలో, సునీల్ గవాస్కర్ (1977-78)లో 1,032 బంతులతో ఐదవ స్థానంలో ఉన్నారు.
అత్యధిక బంతులను ఎదుర్కొన్న రికార్డుతోపాటు ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా పుజారా కొనసాగుతున్నాడు.
సిడ్నీ టెస్టుతో కలిపి 521 పరుగులు చేశాడు.