కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

 

ఢిల్లీ, డిసెంబరు28: కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్ధంగా సేవలందించిన వారి త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ 134వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ సీనియర్ నాయకులతో కలసి ఘనంగా నిర్వహించారు. పార్టీ పతకాన్ని ఆవిష్కరించి, సేవాదళ్ కార్యకర్తల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మాజీ ప్రధానితో రాహుల్ కలసి కేక్ కట్ చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ర్టాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం పార్టీలో ఉత్సాహాన్ని నింపింది.