Rahul – Punarnavi ఒక సింగర్ గా తన కెరీర్ ప్రారంభించి…. ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ఇండస్ట్రీ లో ఫేమస్ పర్సనాలిటీ గా గుర్తింపు పొందిన తెలంగాణ పోరగాడు రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ షో విజేతగా నిలవడంతో అతనికి ప్రేక్షకుల మద్దతూ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. అయితే కెరీర్ పరంగా… అమ్మాయిల ఈ విషయంలో రాహుల్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు.
పైగా బిగ్ బాస్ హౌస్ లో అతడు పునర్నవి భూపాలం తో నడిపిన ప్రేమకథ వీరిద్దరికీ చిన్న క్రేజ్ తీసుకొని రాలేదు. తాజాగా ఆమెకు దూరంగా ఉంటున్న విషయం పై రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. వీరిద్దరూ ముద్దులు పెట్టుకోవడం… హగ్ చేసుకోవడం… డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుకోవడం వంటివి చేశారు. రాహుల్ విజేతగా నిలిచిన తర్వాత కూడా పునర్నవి తో కలిసి ఇంటికి వెళ్ళాడు. బయట కూడా వీరిద్దరూ కొన్ని రోజులు రచ్చ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి పెళ్లి పై ఎన్నో వార్తలు వచ్చాయి. స్పెషల్ ఈవెంట్స్ లో కూడా వీరిద్దరు జంటగా చూపించారు.
ఇక షో పూర్తయిన తర్వాత రాహుల్ లైఫ్ టర్న్ అయిపోయింది. అంతకుముందు ఇటీవల’ఊకో కాకా’ అనే ఒక బట్టల దుకాణాన్ని కూడా ప్రారంభించాడు. ఈ షాప్ ఓపెనింగ్ కు తన క్లోజ్ ఫ్రెండ్ అషు రెడ్దు తో సహా కొంతమంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రాహుల్ ను…. పునర్నవి ను షాప్ ఓపెనింగ్ కు ఎందుకు పిలవలేదు అని యాంకర్ ప్రశ్నించారు.
Rahul – Punarnavi రిలేషన్… సో స్ట్రాంగ్
దానికి రాహుల్…. “షాప్ ఓపెనింగ్ ముందు చాలా ఒత్తిడి ఫీలయ్యాను. తల నొప్పి తట్టుకోలేక టాబ్లెట్లు కూడా వేసుకున్నాను. అంతలా టెన్షన్ పడ్డాను. ఆ టైంలో పిలవడం మర్చిపోయాను. అంతేకానీ మధ్య గొడవలు లేవు” అని చెప్పుకొచ్చాడు. ముందు అందరూ రాహుల్… అషు రెడ్డి తో క్లోజ్ గా ఉన్నాడు అంటూ… అతనిని ఎంతగానో తప్పుబట్టారు. పునర్నవి ని వదిలేసినట్లు చెప్పారు. అయితే రాహుల్ మాత్రం మా మధ్య గొడవలు ఏమీ లేవు నా టెన్షన్ లో పడి మర్చిపోయాను అని అన్నాడు. పునర్నవి కూడా ఈ మధ్య వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా గడుపుతోంది.