Rahul Gandhi: ఏపీ కాంగ్రెస్ కు జవసత్వాలు నింపే పనిలో రాహుల్!రేవంత్ తరహా నేత కోసం గాలింపు!

Share

Rahul Gandhi: ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ ను నియమించిన కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ తరహా ప్రయోగం చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ను మార్చి రేవంత్ రెడ్డి తరహా గట్స్ ఉన్న నేత కు ఏపీ పార్టీ పగ్గాలు అప్పగించాలని ఇప్పటికే హస్తినలో నిర్ణయం అయిపోయిందంటున్నారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఈ కసరత్తు చేస్తున్నారని పార్టీ ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఆయన అతి త్వరలో సమావేశం కానున్నట్లు,ఇప్పటికే ఈ సమావేశానికి పలువురు ఏపీ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు సైతం పంపారని ఆ వర్గాలు తెలిపాయి.

rahul gandhi concentrates on AP Congress
rahul gandhi concentrates on AP Congress

అత్యంత దీనావస్థలో ఏపీ కాంగ్రెస్!

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయ్యింది.2014,2019 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఇంకా చెప్పాలంటే నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది.ఇంతటి దీనావస్థలో కూడా చాలాకాలం పార్టీ కాడెను మోసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి కాంగ్రెస్ కి రాష్ట్రంలో భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చి దాదాపు రాజకీయ సన్యాసం పుచ్చుకొని తన సొంత జిల్లా అనంతపూరుకు వెళ్లిపోయారు.ఆ తరువాత అదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి శైలజానాథ్ కు పార్టీ పగ్గాలు ఇచ్చారు.ఆయన అయినాగానీ పార్టీని పాడె మీద నుంచి లేపలేకున్నారు.

రాహుల్ గాంధీ దింపుడు కళ్లెం ఆశ!

అయితే ఈ మధ్య రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాలను కాస్త పట్టించుకుంటున్నారు.ఈమధ్య ఆయనే స్వయంగా చొరవ తీసుకుని ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ పీసీసీ పదవిని భర్తీ చేశారు.ఎవరి వ్యతిరేకతను కూడా ఖాతరు చేయకుండా రేవంత్ రెడ్డికి ఆయన అండగా నిలిచి అందలమెక్కించారు.ఆంధ్రప్రదేశ్ లో కూడా సరైన సారధి ఉంటే పార్టీ పుంజుకోగలదని రాహుల్ గాంధీ భావిస్తున్నారని, ఇందులో భాగంగానే కాంగ్రెస్ ను పునరుజ్జీవింప చేసే ప్రక్రియను ఆయన చేపట్టారని తెలుస్తోంది.దీని కోసం సీనియర్లను ఢిల్లీ రావాలని రాహుల్ గాంధీ నుంచి పిలుపు అందింది. వచ్చే 15 రోజుల్లో ప్రారంభమయ్యే ఈ మార్పుల ప్రక్రియ ఆగస్టు చివరి కల్లా పూర్తి చేయాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం.శైలజానాథ్ ను పదవి నుండి తప్పించి అవసరమైతే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో రాహుల్ గాంధి ఆలోచనలు సాగుతున్నాయట. ఏం జరుగుతుందో చూడాలి.


Share

Related posts

క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం

Siva Prasad

Pokiri: ఇండస్ట్రీ రికార్డులను వేటాడిన ‘పోకిరి’కి 15 ఏళ్లు

Muraliak

lg పోలీమర్స్ కి అన్ని క్లియరెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే : జగన్

venkat mahesh