NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Congress Party : తమిళనాట తడాఖా చూపాలని కాంగ్రెస్ ఉబలాటం ! రంగంలోకి దిగుతున్న రాహుల్ బాబు!!

Congress Party : తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 2వ వారంలో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఫ్లాన్ చేస్తోంది.తమిళనాడు సహా పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించడంపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్‌ 2 వారంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.

Rahul Gandhi enters the field to strengthen Congress Party!!
Rahul Gandhi enters the field to strengthen Congress Party!!

Congress Party : తమిళనాట తగ్గేది లేదంటున్న కాంగ్రెస్!

అయితే, ఈసారి తమిళనాట వ్యుహాత్మకంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, ఇటు దక్షిణాదిని కూడా సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు తమ పూర్వ వైభవం సాధించుకునేందుకు కాంగ్రెస్ వ్యుహలు పన్నుతోంది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పుదుచ్చేరికి రానున్నారు. ఆరోజు రెడ్డియార్‌ మిల్‌ గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత సోలైనగర్‌లో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అదే విధంగా వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులతో కూడా రాహుల్‌ సమావేశమవుతారని పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఏవీ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు.

అసలు కారణం వేరే?

మరోవైపు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ, వాటి అమలుకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేదీ పలు కొర్రీలు పెడుతున్నారు. దీంతో ఆమెను తొలగించాలంటూ నారాయణస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులు నిరసన కార్యక్రమాలు, నిరహారదీక్షలతో పాటు రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌కు సైతం ఫిర్యాదు చేశారు. సంక్షేమ పథకాలు సరిగ్గా అమలుకాకపోవడంతో పార్టీ కార్యకర్తల్లోనూ కొంత నిస్తేజం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ పార్టీలో ఆ వాతావరణం కనిపించడం లేదు. దీంతో పార్టీలో పరిస్థితిని చక్క దిద్దేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైనట్టు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత రాహుల్‌ పుదుచ్చేరిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 

author avatar
Yandamuri

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N