NewsOrbit
జాతీయం న్యూస్

Rahul Gandhi: రాహుల్ ట్వీట్ పై మోడీ స్పందించారా..? జనవరి నుండి బూస్టర్ డోసులు..!!

5 States Elections: Congress Self mistakes

Rahul Gandhi: కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులను వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తానికి తాను ఇచ్చిన సలహాను కేంద్రం పాటించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. “బుస్టర్ డోసులు వేయాలన్న నా సలహాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అది సరైన నిర్ణయం, వ్యాక్సిన్ బూస్టర్ డోసులు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందించాల్సిన అవసరం ఉంది” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం రాహుల్ గాంధీ దేశంలో వ్యాక్సినేషన్ పై ఓ ట్వీట్ చేశారు. “చాలా మందికి ఇంకా వ్యాక్సిన్లే వేయలేదు. కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసులు ఇంకెప్పుడు వేస్తుంది” అని ప్రశ్నిస్తూ ఈ నెల 22న ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ట్వీట్ పై ప్రధాన మంత్రి మోడీ స్పందించారో లేక ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం మంచి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికే ఇతర దేశాల్లో బూస్టర్ డోసుల పంపిణీ జరుగుతోంది.

Rahul Gandhi tweet on booster dose
Rahul Gandhi tweet on booster dose

Rahul Gandhi: జనవరి 3వ తేదీ నుండి 15 – 18 ఏళ్ళ వారికి

భారతదేశంలో బూస్టర్ డోస్ ల పంపిణీ గురించి నిన్నటి వరకూ కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. నిన్న రాత్రి ప్రధాన మంత్రి మోడీ అకస్మాత్తుగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరూ జాగ్రత్తలు పాటించాలని మాస్క్ లు ధరించాలని, శానిటైజర్ లు వాడాలని సూచించారు. జనవరి 3వ తేదీ నుండి 15 – 18 ఏళ్ళ వారికి వ్యాక్సిన్ లు వేయడంతో పాటు పదవ తేదీ నుండి ఫ్రంట్ లైన్ వారియర్లు, వృద్ధుల (వైద్యుల సూచనల మేరకు)కు బూస్టర్ డోసులు వేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం విదితమే. మరో పక్క భారత్ బయోటెక్ పిల్లల టీకా కోవాగ్జిన్ కు భారత ఔషద నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju