NewsOrbit
న్యూస్

Rahul Gandhi: అట్టడుగు స్థాయిలో రాహుల్ గాంధీ ర్యాంక్!మోడీకి ఏవిధంగానూ ధీటు కాదని తేల్చిన ఇండియా టుడే సర్వే!

Rahul Gandhi: ఇండియా టుడే తాజాగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెలుగు చూశాయి.

 Rahul Gandhi's rank at grassroots level!
Rahul Gandhis rank at grassroots level

ఏ నాటికైనా యువరాజు రాహుల్ గాంధీకి పట్టాభిషేకం జరగకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ వాదులకు మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు ఈ సర్వేలో వచ్చాయి.బీజేపీయేతర పార్టీలకు నాయకత్వం వహించే విషయంలో గానీ, ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా నిలిచే నేతల్లో కానీ రాహుల్ గాంధీ చిట్టచివరి స్థానంలో ఉండడం ఇక్కడ గమనార్హం.

విశ్వసనీయత కలిగిన సర్వే!

ఇండియా టుడే ప్రతి సంవత్సరం జనవరి ఆగస్టు మాసాల్లో మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహిస్తోంది.ఆ సర్వే ఫలితాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తోంది.ఇండియా టుడే కి ఉన్న క్రెడిబులిటీ దృష్ట్యా ఈ సర్వేను కూడా రాజకీయ పరిశీలకులు ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఇండియా టుడే సర్వే కు విశ్వసనీయత ఉంది.

తాజా సర్వేలో తేలిందేమిటంటే!

కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇంకా పుంజుకోలేదని,ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగినా ఆ పార్టీకి డెబ్బై లోపు స్థానాలు వస్తాయని ఇండియా టుడే సర్వే లో వెల్లడైంది.బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏకు 296 సీట్లు,బీజేపీకి సొంతంగా 271స్థానాలు లభిస్తాయని కూడా ఆ సర్వే తేల్చింది.త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బిజెపి అఖండ విజయం సాధించే అవకాశాలున్నాయని, పంజాబ్ లో మాత్రం కాస్త గట్టిపోటీని కాంగ్రెస్ నుండి ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ సర్వే పేర్కొంది.నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చేవారి సంఖ్య కూడా ఈ మధ్య భారీగా పెరిగిందని తెలిపింది

Rahul Gandhi: అట్టడుగున ఉన్న రాహుల్ గాంధీ ర్యాంకింగ్!

ఈ సర్వే లోనే బీజేపీ యేతర కూటమి కి ఎవరు నాయకత్వం వహిస్తే మోడీకి గట్టి పోటీ ఇవ్వగలరన్న అంశం కూడా ఉండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సారధి అయిన రాహుల్ గాంధీకి చిట్టచివరి స్థానం లభించింది.తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే నరేంద్ర మోదీని సమర్థంగా ఎదుర్కోగలరని పదిహేడు శాతం మంది అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంలో సమర్థుడని పదహారు శాతం మంది చెప్పగా రాహుల్ గాంధీకి కేవలం పదకొండు శాతం మంది మద్దతు మాత్రమే లభించింది.అలాగే తర్వాతి ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారన్న అంశానికి సంబంధించిన సర్వేలో రికార్డు స్థాయిలో నరేంద్ర మోడీకి 53 శాతం మంది అనుకూలంగా స్పందించగా కేవలం ఏడు శాతం మంది మాత్రమే రాహుల్ గాంధీకి ఓటు వేశారు.బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఆరుశాతం మంది,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నాలుగు శాతం మంది మద్దతు ప్రకటించారు.దీంతో రాహుల్ గాంధీ రాజకీయంగా రాణించే సూచనలే లేవని కాంగ్రెస్ నేతలు దిగాలు చెందుతున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!