NewsOrbit
న్యూస్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలలో మర్మమేమిటో కానీ కాంగ్రెస్ నేతల మీటింగ్ సక్సెస్!

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను మరోసారి రాహుల్ గాంధీ తీసుకోవాలనుకుంటున్నారా?అంటే ఆయనకు ఆ ఉద్దేశం ఉన్నట్లుగా శనివారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సూచిస్తున్నాయిపార్టీలో అందరూ కోరుకుంటున్నట్టు తను పార్టీకోసం పని చేయదలుచుకుంటున్నానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తూ, అదే సమయంలో సంస్థను ప్రక్షాళన చేయాలంటూ అధిష్టానానికి లేఖ రాసిన 23 మంది అసమ్మతీయులు, ఇంకా విధేయులు శనివారం పార్టీ అధినేత సోనియా గాంధీతో సమావేశమైన వేళ..రాహుల్ ఈ ప్రకటన చేయడం విశేషం. సోనియా నివాసం 10 జనపథ్ లాన్స్ లో జరిగిన ఈ మీటింగ్ లో రాహుల్ తో బాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. కొన్ని నెలల పాటు సాగిన విభేదాలు, పొరపొచ్చాల అనంతరం దాదాపు రాజీ దిశగా ఈ సమావేశం జరిగినట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ లో అందరి అభిమతం ప్రకారం పార్టీ కోసం కృషి చేయదలుచుకుంటున్నట్టు రాహుల్ తెలిపారని ఈ సమావేశానంతరం పార్టీ నేత పవన్ బన్సాల్ వెల్లడించారు. రాహుల్ గాంధీని ఎవరూ విమర్శించలేదన్నారు.

గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీ, ఆనంద్ శర్మ, శశిథరూర్, పి.చిదంబరం సహా పలువురు నేతలు ఈ మీటింగ్ కి హాజరయ్యారు. ఈ సమావేశంలో..పార్టీ భవిష్యత్తు గురించి తామంతా  చర్చించామని పృథ్వీ రాజ్ చవాన్ వెల్లడించారు. ఇది నిర్మాణాత్మకంగా సాగిందన్నారు. గోవా నుంచి సోనియా ఢిల్లీకి తిరిగి వచ్చిన అనంతరం మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆమెతో రెండు సార్లు సమావేశమై ఈ మీటింగ్ కి ఆమెను ఒప్పించినట్టు తెలుస్తోంది.

అసమ్మతి నేతలను బుజ్జగించడానికి ఈ మీటింగ్ దోహదపడగలదని ఆయన సోనియాకు నచ్ఛజెప్పినట్టు సమాచారం. ఇక రాహుల్ చేసిన తాజా ప్రకటనతో పార్టీ హైకమాండ్ విధేయుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. రణదీప్ సింగ్ సూర్జేవాలా వంటి వారు కాంగ్రెస్ కి రాహుల్ నాయకత్వం ఎంతయినా అవసరమని అంటున్నారు. వచ్ఛే ఏడాదిపార్టీ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలో తామంతా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని సూర్జేవాలా తెలిపారు. జరిగేందేదో జరిగిందని, ఇక అంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

 

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!