NewsOrbit
జాతీయం న్యూస్

రాహుల్ కి కోపమొచ్చింది…నడ్డా ప్రశ్నలకు అడ్డదిడ్డమైన జవాబు!

బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా ఇరుకున పెట్టే ట్వీట్లతో ఇరిటేట్ అయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆయనపై పరుషమైన వ్యాఖ్యలుచేశారు.

సుదీర్ఘ విరామం అనంతరం రాహుల్ గాంధీ మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొంటున్న నేపధ్యంలో అంతకు కొద్ది గంటల ముందు జెపి నడ్డా వరుస ట్వీట్లతో ఆయనకు 10ప్రశ్నలు సంధించారు. దీనిపై రాహుల్ ఘాటుగా స్పందించారు. రాహుల్ కి నడ్డా ప్రశ్నావళి! మొత్తానికి నెల రోజుల సెలవు తర్వాత రాహుల్ గాంధీ తిరిగొచ్చాడు.ఆయనను కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన వీటికి సమాధానం చెబుతాడనుకుంటున్నాను అంటూ ట్వీట్లు మొదలెట్టిన నడ్డా ….చైనాపై రాహుల్ గాంధీ,ఆయన వంశం,కాంగ్రెస్ పార్టీ అబద్దాలడటం మానేస్తుందా? రాహుల్ గాంధీ ప్రస్తుతం ప్రస్తావిస్తోన్న అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక ప్రాంతంతో పాటు భారత భూభాగంలోని వేల కిలోమీటర్లు చైనావాళ్లకి పండిట్ నెహ్రూ గిఫ్ట్ గా ఇచ్చిన విషయాన్ని రాహుల్ తిరస్కరించగలడా? మళ్లీ కాంగ్రెస్ ఎందుకు చైనాకు సరెండర్ అవుతోంది? చైనా,దాని కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ కుదుర్చుకున్న ఎంవోయూ ని రద్దు చేయాలన్న ఉద్దేశ్యం ఏమైనా రాహుల్ గాంధీకి ఉందా? అని నడ్డా ప్రశ్నించారు కోవిడ్-19కి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతున్న దేశాన్ని నిరుత్సాహపర్చడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని రాహుల్ వదిలిపెట్టలేదు.

ఇప్పుడు దేశంలో కరోనా కేసులు తగ్గాయి..మన సైంటిస్టులు వ్యాక్సిన్ కనిపెట్టారు.. సైంటిస్టులను మరియు రాహుల్ ఎందుకు అభినందించలేదని,130కోట్ల మంది భారతీయులను కనీసం ఒక్కసారైనా రాహుల్ ఎందుకు ప్రశంసించలేదని, దేశ రైతులను రెచ్చగొట్టడం,తప్పుదోవపట్టించే పనిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆపేస్తుందని,కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రైతుల పట్ల సానుభూతిని రాహుల్ ప్రదర్శిస్తారా అని ?యూపీఏ హయాంలోMSP ఎందుకు పెంచలేదని ,రాహుల్ గాంధీ తమిళనాడులో జల్లికట్టుని చూసి ఆనందించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నసమయంలో జల్లికట్టుని ఎందుకు బ్యాన్ చేశారని ,తమిళనాడు సాంప్రదాయాన్ని ఎందుకు అవమానించారనిరాహుల్ను నిలదీసిన నడ్డా… ధైర్యం కూడగట్టుకొని ఆయన ఈ ప్రశ్నలన్నింటీకి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను అన్నారు.ఒకవేళ ఆయన చెప్పకపోతే..ఈ ప్రశ్నలను మీడియా మిత్రులు రాహుల్ ని అడగాలని నేను కోరుతున్నా అని నడ్డా తన ట్వీట్లుముగించారు. రాహుల్ గాంధీ జవాబిది! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు 10ప్రశ్నలు సంధించడంపై స్పందించిన రాహుల్ గాంధీ…జేపీ నడ్డా ఎవరు? ఆయనకు నేనెందుకు సమాధానం చెప్పాలి?ఆయనేమైనా నా ఫ్రొఫెసరా?నేను దేశానికి సమాధానం చెబుతాను అంటూ జవాబిచ్చారు.

కాగానూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్​ పార్టీ రూపొందించిన బుక్ ​లెట్​ను మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ విడుదల చేశారు.ఈ సందర్భంగా కేంద్రంపై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ఆందోళనను కేంద్రం అశ్రద్ధ చేస్తోందన్నరు. అంతేగాక దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. తాను కేవలం రైతుల గురించి మాత్రమే మాట్లాడటం లేదని.. ప్రభుత్వ మొండి వైఖరిలో ఇది ఒక భాగం మాత్రమేనని… భవిష్యత్తు దృష్యా యువత దీన్ని గమనించాలని రాహుల్ అన్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!