Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ శిందే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రేపు విశ్వాస పరీక్షలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా, స్పీకర్ ఎన్నికలోనే తమ వర్గం బలం నిరూపణ అయ్యింది. ఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరిగింది. బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్, మహా వికాస్ అఘాడీ తరపున రాజస్ సాల్వీ బలిలో నిలవగా, స్పీకర్ ఎన్నికకు ఓటింగ్ ను నిర్వహించారు. ఈ ఓటింగ్ లో రాహుల్ నర్వేకర్ కు 164 ఓట్లు వచ్చాయి. దీంతో రాహుల్ నర్వేకర్ ఎన్నికయినట్లు ప్రకటించారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తర్వాత నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఈ రోజు స్పీకర్ ఎన్నిక, రేపు ఏక్ నాథ్ శిందే బల పరీక్ష జరగనుంది. స్పీకర్ ఎన్నికలోనే బలాబలాలు తేలిపోయాయి. ఈ సమావేేశాల్లో పాల్గొనేందుకు గోవా లో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు 39 మంది, స్వతంత్రులు ఈ రోజు ముంబాయికి చేరుకుని సమావేశాల్లో పాల్గొన్నారు. శిందే వర్గం ఎమ్మెల్యేలు అందరూ ప్రత్యేకంగా తలపాగాలు ధరించి సమావేశంలో పాల్గొన్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…
ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…