బిగ్ బాస్ రియాలిటీ షో పుణ్యమా అంటూ చాలామంది ఫేం ని క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. పేరు విన్నప్పటికి మనిషెవరో జనాలకి తెలియని వాళ్ళని కూడా బిగ్ బాస్ పాపులర్ చేస్తోంది. ఇప్పటికే మూడు సీజన్ లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో త్వరలో నాలుగో సీజన్ ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. అయితే సీజన్ 3 లో టైటిల్ విన్నర్ గా నిలబడిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత నుంచి ఏదో రకంగా వార్తల్లో నిలవడమే కాదు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గాను మారుతున్నాడు.
‘బిగ్ బాస్3’ లో రాహుల్ తన తోటి కంటెస్టెంట్ పునర్నవితో క్లోజ్ గా ఉండటం బయట జనాలు ఈ ఇద్దరికి మంచి పేయిర్ అన్న ఫీడ్ బ్యాక్ ఇవ్వడం తో ఈ జంట గురించి ఇప్పటికే రక రకాల వార్తలు వచ్చాయి. చెప్పాలంటే ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని సీక్రెట్ గా బయట కలుసుకుంటున్నారని చెప్పుకున్నారు. దానికి బిగ్ బాస్ హౌజ్ లో వీరిద్దరి ప్రవర్తన బాగా బలం చేకూర్చింది. అంతేకాదు ఆ మధ్య రాహుల్ వేరెవాళ్ళతో గొడవ పడింది కూడా పునర్నవి విషయంలోనే అన్న వార్తలు బాగా స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఇద్దరు మాది కేవలం స్నేహం మాత్రమే …జనాలే మమ్మలిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఈ ఇద్దరు ఎక్కడా కనిపించింది లేదు.
ఇప్పుడు సడన్ గా రాహుల్ సిప్లిగంజ్ మళ్ళీ వార్తల్లో నిలిచాడు. రాహుల్ పునర్నవి లతో పాటు ‘బిగ్ బాస్3’ లో మరో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన అషూ రెడ్డితో రాహుల్ రిలేషన్ షిప్ లో ఉన్నాడంటూ తాజాగా వార్తలు వస్తున్నాయి. దీంతో రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. ‘యస్.. అషూరెడ్డితో నేను రిలేషన్షిప్ లో ఉన్నాను’.. అంటూ కామెంట్ చేశాడు. మళ్ళీ మా మధ్యన ఉన్నది మీరు అనుకునే రిలేషన్ కాదు! అషూ నాకు జిగిరీ దోస్త్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం చూస్తుంటే రాహుల్ దాగుడుమూతలు ఆడుతున్నట్టు ఉందని జనాలు చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ఇంతకముందు పునర్నవి విషయంలో ఎలా అయితే ప్రవర్తించాడో ఇప్పుడు అషూ రెడ్డితో ను అలానే ప్రవర్తిస్తుండటమే. మరి ఈ రిలేషన్ ఏంటో వాళ్ళకే తెలియాలి అన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?