Rajini Kanth : సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ Rajini Kanth ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రజిని సినిమా వస్తుంది అంటే నిర్మాతలకు కాసుల వర్షమే. భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడంలో రజినీ ట్రాక్ రికార్డ్ ఎవరికీ అందనంత పై స్థాయిలో ఉంటుంది అని ట్రేడ్ వర్గాల కు చెందిన వాళ్ళు చెబుతారు. దీంతో రజనీ సినిమా రిలీజవుతుందంటే స్టార్ హీరోల సినిమాలు వెనక్కి వెళ్లాల్సిందే. కొన్ని దశాబ్దాల పాటు సినిమా ప్రేక్షకులను అలరించిన రజినీకాంత్ గత ఏడాది రాజకీయాల్లోకి వస్తానని చెప్పి అనారోగ్యం కారణంగా చివరాఖరికి యూటర్న్ తీసుకోవడం జరిగింది. దీంతో రజనీకాంత్ అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందడం అందరికీ తెలిసిందే. వాస్తవానికి రజనీకాంత్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కూడా ఆయనని అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగానే సింగర్, బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి కూడా రజనీ అంటే అభిమానమే.
సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా అభిమానించే హీరోలు రజినీకాంత్, సూర్య, ప్రభాస్ అని ఇటీవల తాజా ఇంటర్వ్యూలో రాహుల్ తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే తన అభిమాన హీరో రజినీకాంత్ తో ఫోటో దిగటానికి ఇటీవల విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి వెళ్లిన క్రమంలో జరిగిన సంఘటన పంచుకున్నారు. ఎంతో పెద్ద స్టార్ అయినా గాని చాలా ఆప్యాయంగా పలకరించడం జరిగిందని, అప్పటికే ఆయన నన్ను చూస్తూ ఉండిపోవడం జరిగింది నోట్లో నుంచి ఎలాంటి మాట రాలేదని రాహుల్ తెలిపారు. అయితే తన మనసులో ఆయనతో ఫోటో దిగాలని ఉన్న కోరిక ఆయనే గ్రహించి..ప్రకాష్ అతనికి పిక్చర్ కావాలేమో అంటూ ఆయన తన నీ దగ్గరికి తీసుకుని.. ఫోటో వచ్చేలా రజినీకాంత్ గారు స్పందించారని రాహుల్ తెలిపారు. నిజంగా ఆయన గొప్పతనం అంటూ, ఆయన తన నీ దగ్గరికి తీసుకుని టైం లో రోమాలు నిక్క పొడుచుకునే రీతిలో ఫీలింగ్ కలిగింది అన్నట్టు రాహుల్ ఇంటర్వ్యూలో తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?