ట్రెండింగ్ న్యూస్

ఒకే స్టేజి మీద బిగ్ బాస్ 2, 3 విన్నర్స్.. రచ్చ రచ్చ చేశారుగా?

Rahul Sipligunj and Kaushal in big celebrity challenge
Share

బిగ్ బాస్ విన్నర్స్ అంతా ఒకే స్టేజి మీద ఉంటే ఎలా ఉంటది. అబ్బ.. చూడముచ్చటగా ఉంటుంది కదా. అయితే.. బిగ్ బాస్ తెలుగు నాలుగు సీజన్ల విజేతలను మాత్రం ఒకేసారి చూడలేకపోయాం కానీ.. బిగ్ బాస్ 2, 3 సీజన్ విజేతలను మాత్రం చూసే చాన్స్ ప్రేక్షకులకు దక్కింది. జీ తెలుగులో కొత్తగా బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అనే షోను స్టార్ట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ 27న రాత్రి 9 గంటలకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.

Rahul Sipligunj and Kaushal in big celebrity challenge
Rahul Sipligunj and Kaushal in big celebrity challenge

ఈ షోకు యాంకర్ సుమ, యాంకర్ రవి హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇక.. బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అంటే సెలబ్రిటీలు ఉండాలి కదా.. అందుకే బిగ్ బాస్ 2, 3 విన్నర్స్ కౌశల్, రాహుల్ సిప్లిగంజ్.. ఇద్దరు ఈ బిగ్ సెలబ్రటీ చాలెంజ్ లో పాల్గొన్నారు.

ఈ షోలో భాగంగా.. కొందరు రకరకాల విన్యాసాలు చేస్తారు. స్టంట్లు చేస్తారు. మ్యాజిక్కులు చేస్తారు. వీటన్నింటినీ రాహుల్, కౌశల్ కలిసి చాలెంజ్ చేయాల్సి ఉంటుంది. సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రోగ్రామ్ లో రాహుల్, కౌశల్ మాత్రం తెగ సందడి చేస్తారు. వాళ్లు చేసిన రచ్చకు సంబంధించిన ప్రోమోను తాజాగా జీ తెలుగు విడుదల చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ ప్రోమో చూసేయండి.

ఇక.. యాంకర్లు రవి, సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సుమక్క ఉందంటేనే ఆ షో హిట్టు. తన యాంకరింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది సుమ. రవి కూడా అంతే. తన కుళ్లు పంచులతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో దిట్ట. అందుకే ఈ షో సూపర్ హిట్టే ఇక.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Share

Related posts

కరోనా కి మరో 6 కొత్త లక్షణాలు ఇవే ..

Siva Prasad

Bigg Boss 5 Telugu: అదిరిపోయిన నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్..!!

sekhar

‘సహాయం అందిస్తాం’ 

somaraju sharma