తెలంగాణ జానపద పాటల గాయకుడిగా, రచయితగా, సినిమా పాటల ప్లే బ్యాక్ సింగర్ గా ఈ మధ్యన మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న వ్యక్తి ధూల్ పేట కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ సిప్లిగంజ్ అంటే ప్రస్తుతం ఓ ట్రెండ్ గా మారిపోయింది. తనదైన శైలీలో ఆల్బమ్స్ చేస్తూ ఓ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ‘మంగమ్మా’ అనే ప్రైవేట్ ఆల్బమ్ తో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు ఈ ధూల్ పేట్ కుర్రాడు. బిగ్ బాస్ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కుర్రాడి జాతకం ఓ వైపుకు తిరిగిందనే చెప్పుకోవచ్చు.
బిగ్ బాస్ లోకి ఎంట్రీ కాకముందు రాహుల్ అంటే కేవలం అతని పాటలే గుర్తొచ్చేవి. అంటే ఈ పాటలు ఈ పేరనే వ్యకి పాడుతున్నాడని తెలిసేది. కాని ఇప్పుడు మాత్రం రాహుల్ సిప్లింగ్ అనే వార్త వింటే చాలు అతను అలా మెరుపులా కనిపిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి విన్నర్ గా బయటకొచ్చాడు. బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన రాహుల్ కు వరుసగా సినిమాల్లో సింగర్ గా అవకాశాలు తలుపుతట్టాయి. ఇంకేముంది స్టార్ హీరోలందరి సినిమాల్లో తన గొంతును వినిపిస్తూ బిజీ అయిపోయాడు. కాని బిగ్ బాస్ 3 లో రాహుల్ చేసిన రచ్చ మాత్రం జనాలిప్పటికీ మరచిపోలేదనే చెప్పుకోవచ్చు.
మరీ ముఖ్యంగా పునర్నవి భూపాలంతో రాహుల్ ప్రేమ వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం ఆడియెన్స్ అందరినీ వినోదానికి గురి చేసిందనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం ఎన్నో సినిమాల్లో పాడుతూనే బిగ్ బాస్ 4 షో కు సంబంధించిన చిట్ చాట్ బిగ్ బాస్ బజ్ కు కూడా రాహుల్ హోస్ట్ గా వ్యవహరిస్తూ తన వాక్ చాతుర్యాన్ని బయటపెడుతున్నాడు. దీనిద్వారా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకొస్తున్న కంటెస్టెంట్ లను ఇంటర్వూ చేస్తూ వారి మనసులోని భావనను తెలుసుకుంటాన్నాడు.
మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారనే విషయంపై కూడా ఓ కన్నేసి ఉంచారని అర్థమవుతోంది. కాగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో టాప్ 5 కంటెస్టెంట్లో ఒకడైన అఖిల్ పై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్ చేశాడు. రాహుల్ అఖిల్ గురించి మాట్లాడుతూ.. అఖిల్ సీక్రేట్ రూం కు వెళ్లొచ్చిన తర్వాత ‘ మేకలా లోపలికెళ్లి, వాళ్లు పెట్టిన ప్రోటీన్ల వల్ల పులిలా తిరిగొచ్చానంటూ అఖీల్ మాట్లాడాడు. దానికి రాహుల్ అఖీల్ ను తప్పుబట్టాడు. అప్పటి నుంచి అఖీల్ నచ్చడం లేదని కామెంట్ చేశాడు రాహుల్. అయితే హోస్ట్ నాగార్జున కూడా అఖిల్ మాటల విషయంలో కోపంగా ఉన్నాడని రాహుల్ వ్యాక్యానించాడు. ఇంకేముంది రాహుల్ సీక్రేట్ ను బయటపెట్టాడని నెటిజన్లు అనుకుంటున్నారు.