న్యూస్

Railway News : రైల్వే ప్రయాణికులారా! మీకో శుభవార్త.. ఇక చింతించాల్సిన పని లేదు.!

Railway News
Share

Railway News : త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2022ను తీసుకురాబోతున్న విషయం మీకు తెలుసా. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు ఫేవర్ చేయబోతోంది. అవును.. ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రభావితమైన రైల్వే ప్రయాణికుల పట్ల ఈ బడ్జెట్‌ వరంలా మారబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఈసారి కూడా ట్రైన్ టిక్కెట్ ధరలను పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనితో పాటు రైల్వే ఖర్చుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఒక ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

Railway News : రైల్వే ఛార్జీల పెంపు ప్రస్తుతం అవసరం వుందా?

Railway News
ఓ వైపు ప్రజలను కరోనా మహమ్మారి ఏ విధంగా పీడిస్తుందో అందరికీ తెలిసినదే. ఈ ప్రస్తుత పరిస్థితులలో రైల్వే ఛార్జీల పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ.. 2021-22లో రైల్వే తన ఫ్రయిట్ రెవెన్యూలను 25 శాతం వరకు పెంచిన విషయం తెలిసినదే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే మొత్తంగా ఫ్రయిట్ నుంచి రూ.1.45 లక్షల కోట్లను ఆర్జించనున్నట్టు భోగట్టా.

ప్రస్తుత బడ్జెట్‌ ఇలా వుండబోతుందా?

దాదాపుగా మనం చూసుకుంటే, 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఫ్రయిట్ లేదా ప్యాసెంజర్ టిక్కెట్ ధరలను పెంచిన దాఖలాలు లేవు. కానీ భారతీయ రైల్వేనే 2019 డిసెంబర్‌లో ఒకసారి ప్రయాణికుల టిక్కెట్ ధరలను పెంచింది. కిలోమీటరుకు 4 పైసలు పెంచింది. ట్రైన్ టిక్కెట్ ధరను పెంచడంలో ఎలాంటి లాజిక్ లేదని, ప్రజలపై తాము అదనపు వేయదలుచుకోలేని రైల్వే బోర్డు మాజీ ఛైర్మన్ అయినటువంటి అరుణేంద్ర కుమార్ తాజాగా తెలిపారు.


Share

Related posts

Sachin Vaze ; అర్ణబ్ అరెస్టు – అంబానీ హత్యకు కుట్ర..!? “పోలీస్ అధికారి” చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..!!

Srinivas Manem

Hyderabad Fire Accident: హైదరాబాద్ అగ్ని ప్రమాదంపై పీఎం మోడీ దిగ్భాంతి..ఎక్స్ గ్రేషియా ప్రకటన

somaraju sharma

Star Fruit: స్టార్ ఫ్రూట్ చేసే మేలు గురించి తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar