వర్షం వల్ల నాల్గవరోజు ఆట ముగింపు

సిడ్నీ(ఆస్ట్రేలియా)జనవరి6 : భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు నాల్గవ రోజు ఆట వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసింది. గ్రౌండ్‌లో వర్షపు నీరు నిలవడం, ఆపై వెలుతురు లేని కారణంగా మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్ల అంపైర్లు ప్రకటించారు. 322 పరుగుల తేడాతో వెనుకబడి ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్ జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లకు వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్కన్ హారిన్(2), ఉస్మాన్ ఖ్వాజా(4) ఉన్నారు.