Raj tarun : రాజ్ తరుణ్ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలు చాలా తక్కువ. చేయడానికి వరసగా సినిమాలు చేస్తున్నాడు గాని గట్టి హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. డెబ్యూ సినిమా ఉయ్యాల జంపాల సినిమా తోనే హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో కుమారి 21 ఎఫ్ సినిమాతో క్రేజీ హీరోగా మారాడు. ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ సినిమాతో మరో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నుంచి రాజ్ తరుణ్ కి పెద్దగా సక్సస్ లు రావడం లేదు. కొన్ని సినిమాలు యావరేజ్ అన్న టాక్ దగ్గరే ఆగిపోతే కొన్ని సినిమా అసలు గుర్తు కూడా రావు.
దాంతో కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇద్దరి లోకం ఒకటే అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాని ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయినా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అన్న సినిమా చేసి ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు. అలాగే తాజాగా పవర్ ప్లే అన్న సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి కూడా దర్శకుడు కొండా విజయ్ కుమార్. రిజల్ట్ తేడా కొట్టిందని అంటున్నారు. అయినా మరోసారి కొండా విజయ్ కుమార్ తో సినిమా చేయబోతున్నాడు. ఇది ఇద్దరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా.
Raj tarun : రాజ్ తరుణ్ చేతిలో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయంటున్నాడు.
అంతేకాదు రాజ్ తరుణ్ చేతిలో 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయంటున్నాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చేసిన శ్రీనివాస్ గవిరెడ్డితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావచ్చిందట. యంగ్ డైరెక్టర్ విరించి వర్మతో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 60 శాతం పూర్తయిందని రాజ్ తరుణ్ తెలిపాడు. శాంటో అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేయనున్నాడట. అలాగే అక్కినేని నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో నటించబోతుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు.