Raj tharun: రాజ్ తరుణ్ ఒకప్పుడు ఈ హీరో తీసిన సినిమాకు యమ క్రేజ్ ఉండేది. కానీ రాను రాను ఈ హీరో మార్కెట్ దిగజారిపోయింది. ఇతడు తీసే సినిమాలలో విషయం లేకపోవడంతో ఆడియన్స్ ఈ హీరోను పట్టించుకోవడమే మానేశారు.
SBI alert: అలెర్ట్ అలెర్ట్ …ఎస్బిఐ కస్టమర్లకు అలెర్ట్ …!
పెద్ద బ్యానర్ లో
కానీ ఈ హీరో ఈ సారి అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna studio’s) వంటి పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. అంతే కాకుండా కింగ్ అక్కినేని నాగార్జున చేత ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయిస్తున్నారు. దీంతో ఈ సారి ఎలాగైనా ఈ హీరో హిట్ కొడతాడు కావొచ్చని అందరూ భావిస్తున్నారు. శ్రీను గవిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ (trailer) ఆకట్టుకునేలా ఉంది.
AP Municipal Elections: టీడీపీకి బిగ్ షాక్..! కుప్పంలోనూ వైసీపీ హవా..!!
బంగార్రాజు చేతిలో పడ్డ రాజా
అనుభవించు రాజా అనే డిఫరెంట్ టైటిల్ తో అన్నపూర్ణ స్టూడియోస్ వంటి బిగ్ బ్యానర్ లో సినిమా తీస్తున్న యంగ్ హీరో మూవీ ట్రైలర్ ను బంగార్రాజు నాగార్జున (nagarjuna) విడుదల చేశారు. ఈ ట్రైలర్ రూపాయి పాపాయి వంటిదిరా దానిని పెంచి పెద్ద చేసుకోవాలనే డైలాగ్ తో సినిమా ట్రైలర్ మొదలయింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సెక్యూరిటీ గార్డుగా మనకు కనిపిస్తున్నాడు. కానీ అతడు లవ్ చేసే శృతి అనే అమ్మాయికి మాత్రం సెక్యూరిటీ గార్డులంటే పరమ ఎలర్జీ ఉంటుంది.
Bumper offer: మీరు ఫ్లైట్ ఎక్కాలనీ అనుకుంటున్నారా..? అయితే ఈ ఫ్లైట్ వాళ్ళు బంపర్ ఆఫర్ ప్రకటించారు చూడండి…!
మరి రాజ్ తరుణ్ ఆ అమ్మాయిని ఎలా ముగ్గులోకి దించాడనే విషయాన్ని మనం సినిమాలోనే చూడాలి. ఈ సినిమాను నవంబర్ 26న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారు. మన హీరో సిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నా కానీ ఊళ్లో వేరే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉండేలా కనిపిస్తోంది. అతడు ఊళ్లో చిల్లరమల్లరగా తిరుగుతూ జూదాలు ఆడుకుంటూ ఉండేలా తెలుస్తోంది. అంతే కాకుండా ఎలాగైనా సరే ఊరికి ప్రెసిడెంట్ కావాలనే గోల్ పెట్టుకన్నుట్లుగా చివర్లో మనకు చూపించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ వంటి బడా మ్యూజిక్ డైరెక్టర్ స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమాలో హాట్ బ్యూటీ అరియానా కూడా నటిస్తుంది.