RRR: డైరెక్టర్ రాజమౌళి డిఫరెంట్ ప్లాన్ “RRR” లో ప్రభాస్, రవితేజ..??

Share

RRR: “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “RRR” సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా మధ్యలో మహమ్మారి వైరస్ రావడంతో… షూటింగ్ కి అంతరాయం కలగటం, అదే రీతిలో షూటింగ్ ప్రారంభం లో హీరోలిద్దరుకి  ఎన్టీఆర్, రామ్ చరణ్ కి గాయాలు అవ్వడం జరిగింది. దీంతో షూటింగ్ ఆలస్యం అవటంతో పాటు అనుకున్న సమయానికి  సినిమా రెండు సార్లు రిలీజ్ చేయలేక వాయిదా పడుతూ వచ్చింది.

Prabhas - Ravi Teja: ఆ విష‌యం తెగ‌లేదు.. ప్ర‌భాస్ సినిమాను ప‌క్క‌న  పెట్టేసిన రవితేజ‌

అయితే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 13 వ తారీకు సినిమా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రమోషన్ సాంగ్ ఫ్రెండ్షిప్ తరహాలో చేయాలని రాజమౌళి ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగులో సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కనబడే రీతిలో సరికొత్త ప్లాన్ వేయడం జరిగిందట. అంతమాత్రమే కాకుండా రాజమౌళి తన సినిమాల్లో ఇప్పటి వరకు నటించిన హీరోలందరినీ సాంగ్ లో చూపించాలని.. డిసైడ్ అయ్యాడట.

Read More: RRR: సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న..RRR.. రికార్డ్స్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది..??

దీంతో రవితేజ, ప్రభాస్ కూడా ఈ సాంగ్ లో కనిపించనున్నట్లు చరణ్, ఎన్టీఆర్ లతో స్టెప్పులు వేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సాంగ్ ఆగస్టు మొదటి తారీకు స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాజమౌళి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో కి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో అదే తరహాలో ఈ ప్రమోషన్ సాంగ్ వీడియోతో ఈ సినిమాపై మరింత ఇంట్రస్ట్ కలిగించే రీతిలో రాజమౌళి డిసైడ్ అయినట్లు టాక్.


Share

Related posts

బ్రేకింగ్ : లంచగొండిలపై కఠిన చర్యలు దిశగా నిర్ణయం..! దిశ తరహాలోనే బిల్లు!

Vihari

Varun Tej: మరోసారి బ్లాక్ బస్టర్ హీరోయిన్ తో వరుణ్ తేజ్..??

sekhar

పోలీసులు వేధించొచ్చా… చట్టం ఎం చెబుతుందో తెలుసా? సలాం కేసులో పాఠాలు

Special Bureau