Rajamouli: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా పేరొందిన వారిలో రాజమౌళి, వివి వినాయక్.. ఒకరు. ఇద్దరు డైరెక్టర్లు మాస్ పల్స్ బాగా తెలిసిన స్పెషలిస్ట్ లు. ఇద్దరు తెరకెక్కించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇద్దరిలో ఇప్పుడు రాజమౌళి అయితే ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో క్రేజ్ సంపాదించడం జరిగింది.
ఇదిలా ఉంటే రాజమౌళి 2005వ సంవత్సరంలో ప్రభాస్ తో చేసిన “చత్రపతి” సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ వివి వినాయక్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇటీవల వి.వి.వినాయక్ మాట్లాడారు.
Read more: Rajamouli: ఢిల్లీ ఎయిర్ పోర్టుపై రాజమౌళి అసంతృప్తి..!! ఢిల్లీ ఎయిర్ పోర్టు స్పందన ఏమిటంటే..!!
ఒరిజినల్ కథ రూపొందించిన చత్రపతి సినిమా రైటర్ విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ చత్రపతి కథ కి కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తూ హిందీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ సెట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విషయానికి సంబంధించి రాజమౌళితో చర్చించడం జరుగుతుందని.. ఇటీవల కలవాలని ప్రయత్నించిన కోరలేదని వివి వినాయక్ తెలిపారు. వాస్తవానికి చత్రపతి సినిమా రీమేక్ చేయాలని నాకు ఆలోచన లేదని పేన్ మూవీస్ నిర్మాణసంస్థ.. తన దగ్గరికి రావడంతో.. ఒప్పుకోవడం జరిగింది ఇదే నిర్మాణ సంస్థలో మరో సినిమా చేయడం జరుగుతుందని వి.వి వినాయక్ స్పష్టం చేశారు.