Mahesh: మహేశ్‌కు విలన్‌గా తమిళ స్టార్ హీరోను ఫిక్స్ చేసిన రాజమౌళి..

Share

Mahesh: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతోంది. ప్రసుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రాజమౌళి 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా రూపొందుతున్న ఈ ఫిక్షనల్ డ్రామాలో బాలీవుడ్ నటీనటులు ఆలియా భట్, అజయ్ దేవగణ్, సౌత్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

rajamouli fixed tamil star hero as villan in mahesh movie
rajamouli fixed tamil star hero as villan in mahesh movie

ఈ సినిమా రిలీజ్ తర్వాత మహేశ్ ప్రాజెక్ట్ మొదలవనుండగా రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇది ఆఫ్రికా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందబోతుండగా అడ్వంచర్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో కథ సాగుతుందట. ఈ సినిమాలో మహేశ్‌కు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ను తీసుకుబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం ఇందులో పాత్ర చాలా వెరైటీగా ఉంటుందట. శంకర్ సినిమాలో కొన్ని పాత్రలు చాలా వెరైటీగా ఉంటాయి. ఐ, అపరచితుడు లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ.

Mahesh: త్వరలో అఫీషియల్‌గానూ రాజమౌళి బృందం కన్‌ఫర్మేషన్ ఇవ్వబోతున్నారట.

రాజమౌళి – మహేశ్ సినిమాలోనూ విలన్ పాత్ర ఇలా డిఫరెంట్‌గా ఉంటుందట. అందుకే ఈ పాత్రకు రాజమౌళి విక్రమ్ పర్‌ఫెక్ట్ అని భావించి ఆయనతో సంప్రదింపులు జరిపినట్టు తాజా సమాచారం. త్వరలో దీనిపై అఫీషియల్‌గానూ రాజమౌళి బృందం కన్‌ఫర్మేషన్ ఇవ్వబోతున్నారట. ఈ సినిమా పాన్ ఇండియన్ రేంజ్‌లో రాజమౌళి తెరకెక్కించబోతుండగా అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గ ఆర్ట్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. డా.కె.ఎల్ నారాయణ ఈ సినిమాకు నిర్మాత. అయితే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల మాదిరిగా ఎక్కువ సమయం తీసుకోకుండానే మహేశ్ మూవీని పూర్తి చేయాలనుకుంటున్నారట రాజమౌళి.


Share

Related posts

ఆ పని రౌడీ హీరోతోనే చేస్తానన్న తమన్నా.. మనసులో మాట చెప్పిన మిల్కీ బ్యూటీ..!

Teja

Zareen Khan : ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వల్లే…ఇబ్బందులు పడుతున్నానంటున్న జరీనా ఖాన్..!

Teja

ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రముఖుల పరామర్శ!

Mahesh