RRR: ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమాను ఇంతక ముందెన్నడూ కనివిని ఎరుగని రీతిలో ప్రధాన భారతీయ భాషలతో పాటు వరల్డ్ వైడ్ గానూ మొత్తం 14 భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇంతవరకు ఏ తెలుగు చిత్రాన్ని ఈ స్థాయిలో రిలీజ్ చేసింది లేదనే చెప్పాలి.
ఇక ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, హాలీవుడ్ యంగ్ బ్యూటీ ఒలివియా మోరీస్, శ్రియ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అత్యంత భారీ అంచనాల మధ్య ఆర్ఆర్ఆర్ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుండగా, ఇప్పటికే విడుదలైన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ఊహకందని విధంగా అంచనాల్ని పెంచేసింది. ముఖ్యంగా ఎం ఎం కీరవాణి సంగీతం మెస్మరైజ్ చేస్తోంది.
RRR: జక్కన్న తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఫిక్షనల్ స్టోరీగా రూపొందిన ఈ చిత్ర ప్రమోషన్స్‌ను రాజమౌళి బృందం భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్నినేడు ముంబైలో ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. దీనికోసం భారీగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే, ఈ ఈవెంట్ ను టీవీలలో చూడాలని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు రాజమౌళి ఊహించని షాక్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేయడం లేదని ప్రకటించిన జక్కన్న తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరో రోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను టెలికాస్ట్ చేస్తామంటూ ప్రకటించారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందక తప్పలేదు.