NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ మూడు రాజధానుల సక్సెస్ పై రాజమౌళి ఫుల్ హ్యాపీస్…?

తెలుగు స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావడంపై చాలా ఖుషీగా ఉన్నారట. దర్శకధీరుడు కి అసలు ఏపీ రాజకీయాల తో పనేంటి అని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవాల్సిందే.

 

గతంలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించినప్పుడు చంద్రబాబు బాహుబలి సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి ని హుటాహుటిన క్యాపిటల్ ప్రాంతానికి పిలిపించారు. అతనిని అమరావతి కట్టడాలకు కి సంబంధించిన కొన్ని డెమో మోడల్స్ ను తయారు చేయమని మరియు ఏ రకంగా ఒక రాజధాని కడితే ప్రజలకు బాగుంటుందో సూచించమని అడిగారు. మాహిష్మతి సృష్టికర్త అయిన రాజమౌళి ఎలాంటి మోడల్స్ ను అప్పటి ఏపీ ముఖ్యమంత్రి కి ఇచ్చారో లేదో తెలియదు కానీ ఆయన దాని పట్ల చంద్ర బాబు సంతృప్తి చెందలేదని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక తాను కూడా మర్యాదపూర్వకంగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు కూడా తెలిపారు. అంత పెద్దగా దానిమీద వర్క్ చేసే అవకాశం రాలేదని ఆదిలోనే ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలిగినట్లు తెలిపారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే 2014లో చాలా యాదృశ్చికంగా రాజమౌళి మూడు రాజధానులు నిర్ణయానికి జై కొట్టారు. లోక్ సభ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అప్పటి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను తాను అధికారంలోకి వస్తే నిర్మిస్తానని చెప్పడం గమనార్హం. ఇలాగే అడ్మినిస్ట్రేటివ్ ఒకచోట, లెజిస్లేటివ్ ఒకచోట మరియు జుడీషియరీ మరో చోట నిర్మిస్తారని తెలిపారు. దీనికి రాజమౌళి తన ఫేస్ బుక్ అకౌంట్ లో “లోక్ సత్తా చెప్పిన సూత్రం ఆంధ్రప్రదేశ్ రాజధానికి చాలా మంచి సొల్యూషన్” అని తను కూడా దానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పడం జరిగింది.

ఇక ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు విషయమై దాదాపు తొమ్మిది నెలలు పోరాడి పంతం నెగ్గించుకున్న సమయంలో రాజమౌళి కచ్చితంగా ఆనందపడే ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ సూచించింది కూడా అచ్చం ఇలాంటి మోడలే కాబట్టి రాజమౌళి ఫుల్ ఖుషి అయిపోయి ఉంటాడు అని చెప్పవచ్చు.

author avatar
arun kanna

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju