రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని భారత దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా శక్తి వంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి తర్వతా రాజమౌళి నుంచి వస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటోంది.
కాగా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం గా, రాం చరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ చరణ్ కి జంటగా.. బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగన్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతేకాదు మరికొంత మంది భారీ తారాగణం కూడా ఆర్ ఆర్ ఆర్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంత భారీ తారాగణం నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఎప్పటికప్పుడు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్ సంవత్సరం పాటు ఆలస్యం అయింది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో రక రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి.
అయితే రాజమౌళి ఆ రూమర్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా దాదాపు 8 నెలలు ఆగిపోయిన చిత్రీకరణ తిరిగి అక్టోబర్ 5 నుంచి ప్రారంభం అయి శరవేగంగా చిత్రీకరణ సాగుతుంది. దాంతో ఈ సినిమా సమ్మర్ కానుకగా జూన్ లేదా జూలై లో రిలీజ్ చేస్తామని అన్నారు. కాని ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పోస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి పెద్ద డిసప్పాయింట్మెంటే అని అంటున్నారు. అందుకే రాజమౌళి అందరిలో టన్నుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఉద్దేశంతో ఏకంగా ట్రైలర్ నే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. జనవరి 26 న డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే దేశం మొత్తం సంబరాలు చేసుకుంటారు.