మళ్లీ ప్రభాస్ తో సినిమా అనేసరికి రాజమౌళి షాకింగ్ ఆన్సర్..??

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో తిరుగులేని కాంబినేషన్ గా “బాహుబలి” సినిమా తో ఎస్.ఎస్. రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిస్టరీ క్రియేట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి సినిమా చత్రపతి టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రికార్డులను క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ చిత్రాలు ఏ రేంజ్ లో ఆడియన్స్ ని అలరించాయే తెలిసిందే.

Can't think of anyone else for Baahubali but Prabhas: Rajamouliఈ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ వేగంగా వరల్డ్ వైడ్ గా క్రేజ్ పాకిపోయింది. పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ముద్ర పడిపోవడంతో ఆ రీతిలో ఉండే స్టోరీలకు ప్రభాస్ ఓకే చెబుతూ సినిమాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా రావాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళిని యాంకర్ ప్రశ్నించగా రాజమౌళి సరదా సమాధానమిచ్చారు.

మళ్లీ ప్రభాస్ ని దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఏం చేస్తారో అన్న ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ”వామ్మో.. మళ్లీ ప్రభాస్ తోనా? బాహుబలి కోసం దాదాపు 5 సంవత్సరాలు కలిసి చేశాం. మళ్లీ మా కాంబినేషన్ లో సినిమా అంటే జనాలు తలలు పట్టుకుంటారేమో” అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొద్ది సేపటికి సరదాగా అన్నాను. డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయాలంటే చాలా ఇష్టం. మళ్లీ స్టోరీ కుదిరితే తప్పకుండా చేస్తాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్.ఆర్.ఆర్’ తెరకెక్కిస్తున్న రాజమౌళి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.